మున్సిపల్ ఉద్యోగాల కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం ఇవాళ పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేస్తుంది. అయితే, బెంగాల్ ఫైర్ సర్వీసెస్ మంత్రి సుజిత్ బోస్‌కు సంబంధించిన ఇళ్లతో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తపస్ రాయ్, మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్‌కు సంబంధించిన ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం దాదాపు 6.40 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్ లో కలకత్తా హైకోర్టు మున్సిపాలిటీల రిక్రూట్‌మెంట్‌లో జరిగిన అవకతవకలపై సీబీఐ ఎంక్వైరికీ ఆదేశించింది.
Read Also: Budget 2024 : బడ్జెట్ పై ఆశలు పెట్టుకున్న జీతాల తరగతి.. మరి నిర్మలమ్మ నెరవేర్చేనా ?
ఇక, పౌర సంఘాలు చేసిన రిక్రూట్‌మెంట్‌లలో జరిగిన అవకతవకలపై ఈడీ, సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నాయి. తర్వాత, 2023 ఆగస్టులో ఈ కేసుపై సీబీఐ దర్యాప్తును సవాలు చేస్తూ పశ్చిమ బెంగాల్ సర్కార్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. కాగా, ఈ రిక్రూట్‌మెంట్ కేసుకు సంబంధించి అక్టోబరు 5న ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఫుడ్ అండ్ సప్లైస్ మంత్రి రథిన్ ఘోష్ నివాసంతో సహా పలు ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేసింది.
#WATCH | ED raid underway at the premises of West Bengal minister and TMC leader Sujit Bose in Kolkata. Details awaited. pic.twitter.com/qQNCYuSIV5
— ANI (@ANI) January 12, 2024