Telangana: తెలంగాణంలో ఇవాళ్టి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ కు సెలవులు స్టార్ట్ అయ్యాయి. ఈ నెల17 వరకూ సెలవులు కొనసాగుతాయని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రకటించారు. తిరిగి పాఠశాలలు ఈ నెల 18వ తేదీన రీ ఓపెన్ కానున్నట్టు తెలిపారు. కాగా, జూనియర్ కాలేజీలకు ఈ నెల13 నుంచి16 వరకూ సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ నెల 13న రెండో శనివారం, 14న ఆదివారం భోగి పండగ, అలాగే, 15వ తేదీన మకర సంక్రాంతి, 16వ తేదీన కనుమ పండగ ఉండటంతో తెలంగాణ సర్కార్ సెలవులను ప్రకటించింది. మరోవైపు ఏపీలో ఈ నెల 9వ తేదీ నుంచి 18వ తారీఖు వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ కు సెలవులు ఇవ్వగా.. ఇంటర్,ట్రిపుల్ ఐటీ కాలేజీలకు నిన్నటి నుంచే హాలీడేస్ స్టార్ట్ అయ్యాయి.