భారత్- మల్దీవుల మధ్య వివాదంతో స్థానిక ప్రజలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తమ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూపై విమర్శలు గుప్పిస్తున్నారు. దౌత్యపరమైన సమస్యలు రావడంతో మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టాలను కలిగిస్తుంది అని పేర్కొన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని అమేఠీకి చెందిన శత్రుజ్ఞ బరన్వాల్ అనే వృద్ధుడు.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరును ఏకంగా 9 లక్షల 9 వేల సార్లు రాసి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు.
పశ్చిమ బెంగాల్‌లోని పురూలియాలో గంగా సాగర్‌కు వెళ్తున్న సాధువులను చూసిన కొందరు పిల్లలను ఎత్తుకెళ్తారనుకొని చితకబాదారు. ఈ ఘటన పురులియా జిల్లాలో చోటు చేసుకుంది.
అగ్రరాజ్యం అమెరికాపై మంచు తీఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ శీతాకాలపు తుఫాన్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా మిడ్వెస్ట్ చుట్టు పక్కల రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నాయి.
ఎర్ర సముద్రంలో యుద్ధం జరిగే అవకాశం ఉంది. హౌతీలపై అమెరికా దాడి కొనసాగుతుంది. యెమెన్‌లో హౌతీ బలగాలపై అమెరికా బలగాలు అదనపు దాడిని జరుపుతున్నాయని అమెరికా అధికారులు తెలిపారు.
భారత్ లో మరో రెండు నెలల్లో జరగబోయే లోక్ సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. ఇక, ప్రతిపక్ష కూటమి ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A.) నాయకులు ఇవాళ వర్చువల్ గా కీలక సమావేశం కానున్నారు.
చైనాకు ద్వీపదేశంగా ఉన్న తైవాన్‌పై యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. తైవాన్‌లో ఇవాళ జరుగనున్న ఎన్నికల్లో వెలువడే ఫలితాల ఆధారంగా ఆ దేశ భవితవ్యం ఆధారపడి ఉంటుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. తైవాన్ను తన అధీనంలోకి తీసుకోవాలని డ్రాగన్ కంట్రీ భావిస్తుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాసిక్ కాలారామ్ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని మాట్లాడుతూ.. ఇవాళ నాసికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.. అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ నాసిక్ లో ప్రత్యేక కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు.