కోచింగ్ సెంటర్లను నియంత్రించడానికి లక్ష్యంగా కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. 16 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న స్టూడెంట్స్ ను కోచింగ్ సెంటర్లు చేర్చుకోకూడదని స్పష్టం చేసింది.
అమెరికా- దక్షిణ కొరియా సంయుక్తంగా సైనిక విన్యాసాల చేయడంతో నార్త్ కొరియాకు కోపం తెప్పించింది. దీంతో సౌత్ కొరియా- జపాన్ మధ్య గల సముద్రగర్భంలో అణు దాడి చేసేందుకు అణ్వాయుధ వ్యవస్థను పరీక్షించింది.
అమెరికా గాయని మేరీ మిల్బెన్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 2024లో భారత్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి విజయం సాధిస్తారని జోస్యం చెప్పింది.
భారతదేశంలో గోధుమల నిల్వలు భారీగా పడిపోయాయి. జనవరి 1 నాటికి దేశవ్యా్ప్తంగా కేంద్ర ప్రభుత్వ గోదాముల్లో గోధుమల స్టాక్ 163.59 లక్షల టన్నులుగా ఉన్నట్లు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఫుడ్ ఏజెన్సీలకు చెందిన గణాంకాలను పరిశీలిస్తే నిల్వలు తగ్గినట్లు తెలుస్తుంది.
మణిపూర్లో జరిగిన తాజా దాడుల్లో మయన్మార్ మిలిటెంట్ల హస్తం కూడా ఉండే ఛాన్స్ ఉందని ఈశాన్య రాష్ట్ర భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ అనుమానిస్తున్నారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీస్ కమాండోలు ప్రాణాలను కోల్పోయారు. ఈ దాడులకు పాల్పడిన కుకీ మిలింటెంట్లకు మయన్మార్ తీవ్రవాదుల నుంచి సహాయం అందిందని భద్రతా సలహాదారు కుల్దీప్ అనుమానం వ్యక్తం చేశారు.
వైసీపీ నాలుగవ జాబితాపై వైసీపీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేసింది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాయలంతో సీఎం జగన్ తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ ఈ జాబితాపై ప్రధానంగా చర్చించారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ లో తన సోదరి షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు సతీసమేతంగా హాజరయ్యారు. వైఎస్ రాజారెడ్డి, ప్రియ అట్లూరి నిశ్చితార్థ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు.