ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలకు విశాఖపట్నం ఆథిత్యం ఇవ్వనుంది. అడిషనల్ డీజీపీ రాజీవ్ కుమార్ మీనా తెలిపారు. 14వ అల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్-2024 ఈ సారి విశాఖలో జరగనున్నాయని పేర్కొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్ రసవత్తరంగా మారుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల పోరుకు సిద్ధం అవుతున్నాయి. పొత్తుల విషయంలో టీడీపీ, జనసేన మధ్య తీవ్రంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దాదాపు 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
రేపు విజయవాడలో జరిగే అంబేద్కర్ విగ్రహా విష్కరణకు అందరూ హాజరు కావాలి అని మంత్రి మేరుగు నాగార్జున కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరణ చేస్తారు అని చెప్పారు.
ఇంకో 15 రోజుల్లో గజ్వేల్ క్యాంపు ఆఫీస్ కి మాజీ సీఎం కేసీఆర్ వస్తారు.. కర్ణాటకలో 5 గ్యారెంటీలు అమలు కావట్లేదు.. అక్కడ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నది అని సర్వేలు చెబుతున్నాయి.. కేసీఆర్ గజ్వేల్ ని అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ వాళ్లు బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు.. పీఎసీఎస్ (PACS) చైర్మన్లు, ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్ లని బెదిరించి అక్రమ కేసులు పెడుతున్నారు అని హరీష్ రావు అన్నారు.
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణను తెలుగు టైటాన్స్ ప్లేయర్స్ కలిశారు. రేపటి (జనవరి 19) నుంచి హైదరాబాద్ లో తెలుగు టైటాన్స్ కు చెందిన మ్యాచ్లు మొదలుకానున్నాయి.
ముంబై ట్రాఫిక్ పోలీసులు విధించిన ఆంక్షలను ఓ ఆటో డ్రైవర్ బ్రేక్ చేశాడు. 21.8 కిలో మీటర్ల దూరం ఉన్న ఈ బ్రిడ్జ్ పై ఓ ఆటో ప్రయాణం చేస్తూ కనిపించింది. నిజానికి మూడు చక్రాల వెహికిల్స్ కు ఈ బ్రిడ్జ్ మీదకు అనుమతి లేదు.. కానీ ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్పై ఆటో తిరుగుతున్నట్లు ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు హత్య బెదిరింపులు వచ్చాయి. ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్కు ఫర్ జస్టిస్ గురుపత్వంత్ సింగ్ పన్నూ భగవంత్ మాన్ను చంపేస్తానని హెచ్చరించాడు.
దక్షిణ కొరియాతో ఇకపై ఏకీకరణ సాధ్యం కాదని అన్నారు. దక్షిణ కొరియాను ప్రత్యేక 'శత్రువు దేశం'గా మార్చేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కిమ్ జోంగ్ ఉన్ పిలుపునిచ్చారు.