Underwater Drone: అమెరికా- దక్షిణ కొరియా సంయుక్తంగా సైనిక విన్యాసాల చేయడంతో నార్త్ కొరియాకు కోపం తెప్పించింది. దీంతో సౌత్ కొరియా- జపాన్ మధ్య గల సముద్రగర్భంలో అణు దాడి చేసేందుకు అణ్వాయుధ వ్యవస్థను పరీక్షించింది. ఈ అణు పరీక్ష ఇవాళ తెల్లవారు జామున నిర్వహించినట్లు ఉత్తర కొరియా ప్రభుత్వ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అమెరికా, దక్షిణ కొరియాలకు వ్యతిరేకంగా తమ సైనిక సామర్థ్యాలను చూపించేందుకే ఈ పరీక్ష చేసినట్లు నార్త్ కొరియా పేర్కొంది.
Read Also: Ayodhya Ram Mandir: అయోధ్యకు సిరిసిల్ల నుంచి బంగారు చీర..!
అయితే, ఉత్తర కొరియా అణ్వాయుధ సామర్థ్యంతో నీటి అడుగున దాడి చేసే డ్రోన్‌లను ప్రయోగించింది. తూర్పు తీరంలో ఉన్న సముద్రంలో ఈ ప్రయోగం జరిగిందని నార్త్ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ థింక్ ట్యాంక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా మిలిటరీ సముద్రం అడుగున అణు ఆధారిత ప్రతిఘటనలు మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. అమెరికా దాని మిత్రదేశాల నావికాదళాల శత్రు సైనిక కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఈ ప్రయోగం చేసినట్లు థింక్ ట్యాంక్ వెల్లడించారు.
Read Also: MP Vallabhaneni Balasouri: జనసేనలోకి వైసీపీ ఎంపీ.. నేడు పవన్ కల్యాణ్‌తో భేటీ
ఇక, దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో పాటు జపాన్ నౌకాదళాలు మూడు రోజుల పాటు సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహించాయి. విమాన వాహక నౌక కార్ల్ విన్సన్, అణ్వాయుధ ఉత్తర కొరియా నుంచి వచ్చే బెదిరింపులకు ప్రతిస్పందనను మెరుగుపరిచే ప్రయత్నాలలో భాగంగా అమెరికా- జపాన్- దక్షిణ కొరియా సిద్ధం అవుతున్నాయి.