FCI: భారతదేశంలో గోధుమల నిల్వలు భారీగా పడిపోయాయి. జనవరి 1 నాటికి దేశవ్యా్ప్తంగా కేంద్ర ప్రభుత్వ గోదాముల్లో గోధుమల స్టాక్ 163.59 లక్షల టన్నులుగా ఉన్నట్లు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఫుడ్ ఏజెన్సీలకు చెందిన గణాంకాలను పరిశీలిస్తే నిల్వలు తగ్గినట్లు తెలుస్తుంది. 2017 తర్వాత ఈ స్థాయిలో గోధుమల నిల్వలు పడిపోవడం ఇదే తొలిసారి. గోధుమల నిల్వల కనీస బఫర్ స్థాయిని 138 లక్షల టన్నులుగా FCI నిర్ణయించింది.
Read Also: Indian Aviation Industry : 2030 నాటికి 30కోట్లమంది ప్రయాణీకులు.. అర్జంట్ గా 2840 విమానాలు అవసరం
అయితే, ప్రస్తుతం బఫర్ స్థాయి కంటే గోధుమల నిల్వలు ఎక్కువగా ఉన్నట్లు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. కానీ, ఉక్రెయిన్- రష్యా, ఇజ్రాయెల్-హమాస్, ఇరాన్- పాకిస్థాన్ దేశాల మధ్య కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితులు పలు దేశాల ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీంతో పాటు ద్రవ్యోల్బణ లోటుపాట్లు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ లో గోధుమలకు కొరత ఏర్పడితే.. అది తీవ్ర ఆహార సంక్షోభానికి దారి తీయొచ్చని విశ్లేషకులు వార్నింగ్ ఇస్తున్నారు. వెంటనే గోధుమల నిల్వలను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Gold Price Today : మరోసారి దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
ఇక, గత సంవత్సరం, ప్రపంచంలోని రెండవ అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారుగా ఉన్న భారతదేశం గోధుమల ఎగుమతిని నిలిపివేసింది. ధాన్యం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను అవలంబించింది. గోధుమలు, బాస్మతీయేతర బియ్యం ఎగుమతులను నిషేధించడంతో సహా టోకు వ్యాపారులు, రిటైలర్లు 1,000 టన్నుల కంటే ఎక్కువ గోధుమలను కలిగి ఉండకూడదని తెలిపింది. అయితే, గత ఏడు సంవత్సరాల్లో అత్యధిక నిల్వలు 2021లో నమోదయ్యాయి. మొత్తం గోధుమ నిల్వలు 342.90 లక్షల టన్నులుగా ఉన్నాయి. ఇది 2022లో 330.12 లక్షల టన్నులకు, 2023లో 171.70 లక్షల టన్నులకు తగ్గింది. ప్రస్తుత నిల్వల ప్రకారం స్టాక్ 163.59 లక్షల టన్నులుగా ఉంది.. వెంటనే ధాన్యం సేకరణ చేస్తామని FCI ప్రకటించింది.