German Singer: అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపనకు సన్నాహాలు జరుగుతున్నాయి.. భారతదేశం మొత్తం ఆ శ్రీరాముడి నామంతో మునిగిపోయింది. రామభక్తి మన దేశంలోనే కాదు ప్రపంచమంతటా వ్యాపిస్తోంది. ఒక జర్మన్ గాయకురాలు రాముడికి సంబందించి అందమైన పాటను తనదైన శైలిలో పాడింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
Read Also: Ram Mandir : అయోధ్యకు ఫ్రీ బస్ టిక్కెట్.. ఆఫర్ పరిమిత సమయం మాత్రమే
కాగా, జర్మన్ సింగర్ పేరు కాసాండ్రా మే స్పిట్‌మన్.. ఆమె పాడిన పాట ఇప్పటికే ఇండియాలో బాగా పాపులర్ అయింది. ఆ పాట రామ్ ఆయేంగేతో అంగనా సజ్జనే అంటూ సాగుతుంది.. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ పాటను మెచ్చుకుని గాయనికి అభినందనలు తెలిపారు. ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో రామ్ భజన్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో కొత్త రాముడికి సంబంధించిన భక్తి పాటలను పంచుకోవాలని పీఎం మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Read Also: SC Classification: ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం
అయితే, అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ ప్రారంభమై ప్రతిరోజూ ఏదో ఒక కార్యక్రమం కొనసాగుతుంది. ఇవాళ కూడా పలు పూజలు నిర్వహిస్తున్నారు.. అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం దాదాపు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇందులో మొత్తం 13 బ్లాకులను నిర్మిస్తున్నారు.. ఈ వేదిక నిర్మాణం పనులు కూడా శరవేగంగా కొనసాగుతోంది. రామమందిరం ప్రాణ ప్రతిష్టకు హాజరయ్యే భక్తుల కోసం ఒకే రకమైన కుర్చీలను కూడా ఆలయ కమిటీ ఏర్పాటు చేస్తుంది. పండల్ మొత్తాన్ని రెడ్ కార్పెట్‌తో అలంకరించారు. ఈ నెల 22న ప్రధాని మోడీ రామమందిరాన్ని ప్రారంభించనున్నారు.
Video of German Singer Cassandra Mae Spittmann singing the devotional song ‘Ram Aayenge’ has gone viral on social media. pic.twitter.com/4lg5KMcpKR
— Megh Updates 🚨™ (@MeghUpdates) January 18, 2024