India – Maldives: భారత్ – మాల్దీవుల మధ్య వివాదం నేపథ్యంలో కీలక పరిణామం నెలకొంది. ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. ఉగాండా రాజధాని నగరం కంపాలాలో మాల్దీవుల విదేశామంగ మంత్రి మూసా జమీర్‌తో భారత విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్.. రెండు రోజుల నామ్ శిఖరాగ్ర సదస్సులో వీరిద్దరూ సమావేశం అయ్యారు. ఇక, ఈ విషయాన్ని జైశంకర్ ఎక్స్( ట్విట్టర్ ) వేదికగా తెలియజేశారు. అయితే, మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్‌తో జరిగిన భేటీలో భారత్ -మాల్దీవుల సంబంధాలపై స్పష్టమైన సంభాషణ జరిగింది అని జైశంకర్ తెలిపారు. నామ్ (NAM) సంబంధిత అంశాలను కూడా చర్చించామన్నారు.
Read Also: Naa Saami Ranga collections : ఐదో రోజు నాగార్జున మూవీ కలెక్షన్స్..అన్ని కోట్లు వస్తే హిట్..
ఇక, మూసా జమీర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. నామ్ సమ్మిట్‌లో భాగంగా జైశంకర్‌ని కలవడం సంతోషంగా ఉందని తెలిపారు. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ, మాల్దీవులలో కొనసాగుతున్న డెవలప్‌మెంట్ ప్రాజెక్టులను వేగవంతం చేయడం, సార్క్, నామ్‌ల సహకారంపై అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు. సార్క్, నామ్‌ల బలోపేతం, విస్తరణకు మాల్దీవుల సహకారం ఉంటుందన్నారు. జైశంకర్‌తో దిగిన ఫొటోని మూసా షేర్ చేశారు.
Read Also: Coaching Centers: ఆ స్టూడెంట్స్ ను చేర్చుకోవద్దు.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు..
కాగా, భారత ప్రధాని మోడీ లక్షదీప్‌ను సందర్శించడంపై మాల్దీవులు మంత్రులు విమర్శలు చేయడంతో.. ‘బాయ్‌కాట్ మాల్దీవులు’ పేరిట భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బాగా దెబ్బ తిన్నాయి. చైనా అనుకూలంగా పని చేస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ ఇటీవలే తమ దేశంలోని భారత సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని కీలక ప్రకటన చేసింది.
Met Maldives FM @MoosaZameer today in Kampala.
A frank conversation on 🇮🇳-🇲🇻 ties. Also discussed NAM related issues. pic.twitter.com/P7ResFlCaK
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 18, 2024