Tension in YCP: వైసీపీలో సీట్ల పంచాయితీ కొనసాగుతుంది. ఎమ్మెల్యే టికెట్ లభించని వారు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో అధికార వైసీపీకి తీవ్ర తలనొప్పిగా మారింది. అయితే, అందులో భాగంగానే బెజవాడ సెంట్రల్ సీటుపై కూడా పంచాయితీ నడుస్తుంది. ఇవాళ సెంట్రల్ నియోజక వర్గంలో కొత్త ఇంఛార్జ్, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రావాలని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును నిన్న రాత్రి కలిసి ఆయన ఆహ్వానించారు. అయితే, వెలంపల్లి ఆహానాన్ని విష్ణు సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.
Read Also: LIC : ప్రాణ ప్రతిష్ఠా రోజున దేశానికి పెద్ద కానుక ఇవ్వనున్న ఎల్‌ఐసీ
అయితే, మల్లాది విష్ణు వర్గం కూడా వెలంపల్లి శ్రీనివాస్ పాదయాత్ర కార్యక్రమానికి దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నెల 25న తన వర్గంతో మల్లాది విష్ణు సమావేశం కాబోతున్నారు. ఈ భేటీలో ఏం చేయాలనే దానిపై విష్ణు తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు పార్ట కేడర్ చెబుతుంది. దీంతో ఒంటరిగానే సెంట్రల్ నియోజకవర్గంలో వెలంపల్లి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. కాగా, ఈ నెల 28న సెంట్రల్ సెగ్మెంట్లో పార్టీ కార్యాలయాన్ని ఇంఛార్జ్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ప్రారంభించనున్నారు.