రాంలాల దర్శనం కోసం రామాలయం వెలుపల భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దర్శన సమయాన్ని కూడా పొడిగించారు. ఇకపై భక్తులు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రాంలాలా దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
విమానాల్లో అనేక అవకతవకలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.1.10 కోట్ల భారీ జరిమానా విధించింది.
కేటీఆర్ 420 అని అందరికీ తెలుసు అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విమర్శించారు. హైదరాబాద్ లో చిన్న ప్లాట్ కూడా లేకుండే. ఇప్పుడు ఏ ఫామ్ హౌస్ చూసినా కేటీఆర్ దే అంటున్నారు.. 100 రోజుల్లో పూర్తి చేస్తామని హామీలు ఇచ్చాం.. అమలు చేస్తామని చెప్పుకొచ్చారు.
ప్రతిపక్ష ఇండియా కూటమికి పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ గట్టి షాక్ ఇచ్చింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లు దీదీ వెల్లడించారు. బెంగాల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ఆమె తెలిపారు.
సిద్దిపేటలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబంలో మెదక్ ఎంపీ సీటు కోసం గొడవలు జరుగుతున్నాయి అని ఆరోపించారు.
మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ ప్రైజెస్ డెవలప్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆధ్వర్యంలో టూరిజం ప్లాజాలో నిర్వహించిన వెండర్స్ డెవలప్మెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు.
తెలంగాణ పౌరులు, ప్రజా ప్రతినిధులు ఎవరైనా కానీ మా సీఎంని కలవొచ్చు అని తెలిపారు. పార్టీలో చేరుతున్నారు అని జరుగుతున్న ప్రచారంపై నాకు సమాచారం లేదు అని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని లేఖలో కోరారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యే నిన్న ( మంగళవారం ) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో పార్టీ మారుతున్నారంటూ వచ్చిన వ్యాఖ్యలపై ఇవాళ నలుగురు ఎమ్మెల్యే ప్రెస్ మీట్ నిర్వహించి వివరణ ఇస్తున్నారు.
చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదు అయింది. మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై దుర్భాషలాడిన ఘటనలో ఎంపీ రంజిత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఎంపీ రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి తిట్టారని.. బెదిరింపులకు పాల్పడినట్లు మాజీ ఎంపీ ఆరోపించారు.