హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఆస్తులపై కొనసాగుతున్న విచారణ కొనసాగుతుంది. హెచ్ఎండీఏలో సంవత్సర కాలంగా బాలకృష్ణ అనుమతులపై విచారణ కొనసాగుతుంది. ఇక, బాలకృష్ణకు సహకరించిన అధికారుల పాత్రపై కూడా ఎంక్వైరీ కొనసాగుతుంది. నేడు హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. దీనిపై ఏసీబీ కోర్ట్ లో ఇప్పటికే కస్టడీ పిటీషన్ ను అధికారులు దాఖలు చేశారు. అయితే, బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలను వెల్లడించారు. లే అవుట్ అనుమతుల కోసం భారీగా లంచాలు డిమాండ్ చేసినట్లు సమాచారం.. అప్లికేషన్ లో తప్పులు వున్నాయని మభ్యపెట్టి వారి నుంచి భారీగా లాభాలు పొందినట్లు ఏసీబీ గుర్తించింది. ప్లాట్ ల నిర్మాణాల్లో విల్లాలను సైతం లంచంగా బాలకృష్ణ పొందినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. తన బినామీల పేరిట విల్లా రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తుంది.
Read Also: India vs England: తొలి ఇన్సింగ్స్ లో భారత్ ఆలౌట్.. జడేజా సెంచరీ మిస్..
ఇక, బాలకృష్ణ అధ్వర్యంలో హెచ్ఎండీఏ, రెరాలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. HMDA ఆఫీసులోని 5వ అంతస్థులో కొద్ది మందికి మాత్రమే ప్రవేశం ఉండేదని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఏసీబీ రేడార్లో బాలకృష్ణకు పరోక్షంగా సహకరించిన 30 మంది అధికారులను విచారణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలకృష్ణ ఫోన్లను ఏసీబీ రిట్రైవ్ చేస్తుంది. అలాగే, రెండు సంవత్సరాల క్రితమే బాలకృష్ణపై ఏసీబీకి ఫిర్యాదులు వచ్చాయి. ఇక, HMDAలోని 3 జోన్ లపై బాలకృష్ణకు పట్టు ఉంది. జోన్ ల కేటాయింపులను పలువురికి విస్తృత ప్రయోజనాలు కల్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన పరిధిలో ఉన్న జోన్ లో ఒక్కో ఎకరం 20 కోట్ల రూపాయలకు పైబడే ఉండేది. వట్టినాగులపల్లిలో భూ వినియోగ మార్పిడి జీఓపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఇక, బాలకృష్ణను కస్టిడీలోకి తీసుకున్నాక బ్యాంక్ లాకర్లు కూడా ఓపెన్ చేసేందుకు ఏసీబీ అధికారులు ప్లాన్ చేశారు.