ఇండియాలో 2022లో కొత్తగా 14.1 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆ ఏడాది సుమారు 9.1 లక్షల మంది క్యాన్సర్ వ్యాధి వల్ల చనిపోయారు. అయితే, భారతీయుల్లో ఎక్కువ శాతం రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్కయ సంస్థ వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ ఇవాళ సచివాలయంలో సమావేశం కానుంది. వక్ఫ్ బోర్డు, దేవాదాయ భూములపై ఆయా శాఖలతో కమిటీ ప్రతినిధులు ప్రధానంగా చర్చించనున్నారు.
నేడు ఒడిశాలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించబోతున్నారు. ప్రధాని మోడీ మధ్యాహ్నం ఝార్సుగూడ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2:15 గంటలకు సంబల్పూర్ కు ఆయన వెళ్తారు.
ఢిల్లీలో ఆప్, బీజేపీల ప్రదర్శన కారణంగా సెంట్రల్ ఢిల్లీతో పాటు రాజధానిలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ నిరసనలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు బారికేడ్లు వేసి పలు రహదారులను మూసి వేశారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
పేపర్ లీకేజీల సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం (ఫిబ్రవరి 5వ తేదీ) నాడు లోక్సభలో జాతీయ పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లును ప్రవేశ పెట్టబోతుంది.
గత కొద్దీ రోజులుగా పేటీఎం షేర్లు ఒక్కసారిగా పడిపోవడంతో దాని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు.
రాష్ట్ర బకాయిలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసినందుకు నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరసన చేపట్టనున్నారు. ముఖ్యంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MNREGA) కింద కేంద్రం బకాయిలను నిలుపుదల చేసింది. దీంతో కేంద్ర సర్కార్ కు వ్యతిరేకంగా ఇవాళ మమతా బెనర్జీ ఆందోళనకు పిలుపునిచ్చింది.