PM Modi: నేడు ఒడిశా పర్యటనకు ప్రధాని మోడీ.. పలు ప్రాజెక్టులకు శ్రీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు ఒడిశాలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించబోతున్నారు. ప్రధాని మోడీ మధ్యాహ్నం ఝార్సుగూడ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2:15 గంటలకు సంబల్‌పూర్ కు ఆయన వెళ్తారు. ఈ సందర్భంగా జగదీష్‌పూర్-హల్దియా, బొకారో-ధమ్రా పైప్‌లైన్ ప్రాజెక్ట్ (జెహెచ్‌బీడీపీఎల్)లోని 412 కిలోమీటర్ల పొడవైన ధమ్రా అంగుల్ పైప్‌లైన్ సెక్షన్‌ను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. ప్రధాన మంత్రి ఊర్జా గంగ కింద 2,450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఒడిశాను జాతీయ గ్యాస్ గ్రిడ్‌తో అనుసంధానిస్తుంది.
Read Also: TATA : గరిష్ట స్థాయికి చేరుకున్న టాటా కంపెనీ.. మూడు నెలల్లో రూ.7,025 కోట్లు ఆర్జించింది
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
- Story Board: సర్ పేరుతో ఏమిటీ ప్రహసనం..? సామాన్యుల దగ్గర్నుంచీ వీవీఐపీల దాకా ఎవర్నీ వదలరా..?
- OTR: టీడీపీ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదా..? ఎందుకంత కష్టమొచ్చింది..?
ఇక, అదేవిధంగా ముంబై-నాగ్‌పూర్-ఝార్సుగూడ పైప్‌లైన్ ప్రాజెక్ట్‌లోని నాగ్‌పూర్-జార్సుగూడ సహజ వాయువు పైప్‌లైన్ సెక్షన్‌కు కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు 2,660 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు కానుంది. దీంతో ఒడిశా- మహారాష్ట్ర- ఛత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రాల్లో సహజవాయువు లభ్యత మెరుగుపడుతుంది. అలాగే దాదాపు 28,980 కోట్ల రూపాయల విలువైన పలు విద్యుత్ ప్రాజెక్టులకు కూడా ప్రధాని మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక, ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు.
తాజావార్తలు
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
-
Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
-
Off The Record : ఎన్నికల కోసం బీఆర్ఎస్ EXTRA కేర్ తీసుకుంటుందా?
-
ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
-
CDSCO Warning : పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్‌తో జాగ్రత్త.. కిడ్నీలకు ముప్పు!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!