Nitish Kumar: భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీలు బలహీనమైపోతున్నాయని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు ఎన్నో అవకాశాలున్నాయి.. అయితే వాటిని ప్రతిపక్షాలు సద్వినియోగం చేసుకోలేకపోయాయని తెలిపారు. విపక్షాల కూటమిని అంతం చేసేందుకు నితీష్ కుమార్‌తో బీజేపీ మళ్లీ చేతులు కలిపిందని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.
తాజా రాజకీయ పరిస్థితులపై ప్రశాంత్ కిషోర్ బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి అధికార కేంద్రీకరణను భారతదేశంలో ఎన్నడూ చూడలేదన్నారు.. ఒక పార్టీకి ఇన్ని సార్లు అధికారంలోకి వస్తే ప్రతిపక్ష పార్టీలకు కష్టంగా మారుతుందన్నారు. అయితే, ఇది మొదటిసారి జరగడం లేదు.. ఇందిరాగాంధీ కాలంలో ఇండియా అంటే ఇందిర, ఇందిరా ఈజ్ ఇండియా అని చెప్పేవారు అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు బీజేపీ ప్రతిపక్షాలకు చాలా అవకాశాలు ఇచ్చింది.. కానీ వాటిని ఆ కూటమి సద్వినియోగం చేసుకోలేదన్నారు.
Read Also: TS Vs AP: తెలంగాణలో ఏపీ పోలీసుల వ్యవహారం.. ఉద్యోగానికి సెలవు పెట్టి గంజాయి స్మగ్లింగ్
ఇండియా కూటమి నుంచి ఎన్డీయేలోకి నితీష్ కుమార్ వెళ్లిపోయిన కూడా అతడినే బీజేపీ బీహార్ ముఖ్యమంత్రిగా చేసింది. ఎందుకంటే, ఇండియా కూటమి ఆలోచనను అంతం చేయాలనే ఉద్దేశ్యంతో బీజేపీ ఇలా చేసింది.. ఈ కూటమిలో నితీష్ కుమార్ పాత్ర కీలకమైంది.. కాబట్టి విపక్ష కుటమిని విచ్ఛన్నం చేయడంలో కమలం పార్టీ సక్సెస్ సాధించింది.. దీని వల్ల బీజేపీకి లాభం చేకూరుతుంది.. బీజేపీ చేసిన తప్పులను ఎత్తి చూపడంలో విపక్ష కూటమి సభ్యులు ఫెయిల్ అయ్యారు.. వారు ఫ్లైట్ జర్నీపై దృష్టి ప్రజా సమస్యలపై పెట్టి ఉంటే వచ్చే ఎన్నికల్లో మంచి పోటీ ఇచ్చేవాళ్లు అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు.