భారతదేశంతో ఉద్రిక్తత మధ్య పొరుగు దేశం పాకిస్తాన్ మాల్దీవులకు మద్దతుగా ముందుకు వచ్చింది. మాల్దీవుల అభివృద్ధి పనుల్లో సాయం చేస్తామని పాకిస్థాన్ హామీ ఇచ్చింది.
కెన్యా రాజధాని నైరోబీలో నిన్న అర్థరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుడులో 165 మంది గాయపడినట్లు తెలుస్తుంది. ఈ పేలుడు శబ్ధం చాలా పెద్దగా రావడంతో చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెణిగేరి అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఒహియోలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఛండీఘర్ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలైంది. దీంతో ఆప్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. మేయర్ ఎన్నికల్లో బీజేపీ మోసం చేసి విజయం సాధించిందని కేజ్రీవాల్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఎర్ర సముద్రంలో మరో వాణిజ్య నౌకపై గురువారం నాడు హౌతీ తిరుగుబాట దారులు దాడి చేసినట్లు అమెరికా వెల్లడించింది. లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న నౌకపై రెండు బాలిస్టిక్ క్షిపణులను యెమెన్‌లోని హూదేదా నుంచి రెబల్స్ ప్రయోగించినట్లు తెలిపింది.
ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఆయన మొదటి జిల్లా పర్యటన కాగా, ఇంద్రవెల్లి సభలో మూడు గ్యారెంటీలను ప్రకటించే అవకాశం ఉంది.