maldives-india row: భారత్‌తో సంబంధాలు క్షీణించిన తర్వాత మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురైతుంది. మహ్మద్ ముయిజుపై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టేందుకు మాల్దీవుల ప్రధాన ప్రతిపక్ష పార్టీ సిద్ధమైంది. దీనిపై భారత్ కూడా తన వైఖరిని స్పష్టం చేసింది. వీక్లీ మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఇది మాల్దీవుల అంతర్గత విషయం.. దీనిపై వ్యాఖ్యానించడానికి భారతదేశం ఇష్టపడదని తెలిపారు.
Read Also: Hydrabad ORR: ఓఆర్‌ఆర్ చుట్టూ HMDA టౌన్‌షిప్‌లు.. మరింత పెరగనున్న భూముల ధరలు..!
అయితే, గత వారం మాల్దీవుల పార్లమెంట్‌లో ప్రతిపక్ష మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఒక ఎంపీ మాట్లాడుతూ.. ముయిజ్జూపై అభిశంసన తీర్మానాన్ని దాఖలు చేయడానికి తమ పార్టీతో పాటు ఇతర ఎంపీల దగ్గర నుంచి సంతకాలను సేకరించామన్నారు. అయితే, ప్రతిపక్షాలు ఇంకా పార్లమెంటులో ప్రవేశపెట్టలేదని ఆయన అన్నారు.
Read Also: Vishwambhara: ఇట్స్ అఫీషియల్.. చిరంజీవి ‘విశ్వంభర’ వచ్చేది ఎప్పుడంటే!
మాల్దీవుల పార్లమెంట్‌లో హింస చెలరేగిన ఒక రోజు తర్వాత ప్రభుత్వ అనుకూల పార్టీలైన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (PNC), ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ (PPM) ఎంపీలు సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించి స్పీకర్‌తో గొడవకు దిగారు. అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ క్యాబినెట్‌లోని మంత్రుల కోసం పార్లమెంటరీ ఆమోదం కోసం పిలిచిన ప్రత్యేక సమావేశంలో ఈ ఘర్షణ జరిగింది.