లోక్‌సభ ఎన్నికలు దగ్గర వేళ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రాజకీయం తీవ్ర కలకలం రేపుతుంది. ఇప్పటికే జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ కాగా, బీహార్‌లో మహాకూటమి ప్రభుత్వం పోయి ఇప్పుడు అక్కడ ఎన్డీయే ప్రభుత్వం వచ్చింది. ఇక, ఢిల్లీలోనూ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఈడీ మధ్య వార్ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతోంది. అలాగే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు కోల్‌కతాలో నిరసన చేస్తారు.
Read Also: Poonam Pandey Death: పూనమ్ పాండే మృతి?.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్!
రాష్ట్ర బకాయిలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసినందుకు నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరసన చేపట్టనున్నారు. ముఖ్యంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MNREGA) కింద కేంద్రం బకాయిలను నిలుపుదల చేసింది. దీంతో కేంద్ర సర్కార్ కు వ్యతిరేకంగా ఇవాళ మమతా బెనర్జీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ.. రెడ్ రోడ్ ప్రాంతంలోని మైదానంలో మధ్యాహ్నం 1 గంటలకు నిరసన ప్రారంభమవుతుంది అని చెప్పుకొచ్చారు. మా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఈ నిరసనకు నాయకత్వం వహిస్తారు.. అలాగే, ఇతర పార్టీ సీనియర్ నేతలు కూడా హాజరుకానున్నారు అని వెల్లడించారు.
Read Also: MLA Burra Madhusudan Yadav: నేను పార్టీ మారడం లేదు.. జీవితాంతం జగన్‌తోనే..!
అయితే, అంతకుముందు తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ కార్యకర్తల బృందంతో కలిసి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన ప్రదర్శన చేశారు. గత ఏడాది మార్చిలో మమతా బెనర్జీ నేతృత్వంలో ఇదే విధంగా రెండు రోజుల ధర్నా నిర్వహించారు. ఇక, పశ్చిమ బెంగాల్ లో బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమవుతాయి.. అప్పటి వరకు ఈ నిరసన కొనసాగే అవకాశం ఉందని టీఎంసీ నేతలు తెలిపారు.