విశాఖపట్నంలో నకిలీ కరెన్సీ నోట్లు చెలామణి జోరుగా సాగుతుంది. తాజాగా, నగరంలో బ్లాక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు అయింది. నకిలీ కరెన్సీ చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్ల కాగితలను కరెన్సీ నోట్లుగా మారుస్తామంటూ మోసం చేశారు. బ్లాక్ కరెన్సీ ముఠాను టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఇవాళ్టి నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి పర్యటించబోతున్నారు. ఈ రోజు నుంచి 23 వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆమె పర్యటన కొనసాగుతుంది. కుప్పం, పలమనేరు, పుంగనూరు, పూతలపట్టు, చిత్తూరు, జీడీ నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటన జరుగనుంది.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం (IIMV) శాశ్వత క్యాంపస్ ప్రారంభానికి సిద్ధమైంది. నగర శివారున ఆనందపురం మండలం గంభీరంలో 436 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ క్యాంప్‌సను ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
నేడు రెండో రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించనున్నారు. నేటి ఉదయం 10 గంటల నుంచి రాజమండ్రి ఏవీఏ రోడ్ లో ఉన్న జనసేన పార్లమెంటు కార్యాలయంలో సమావేశాలు జరగనున్నాయి.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్.. నిరు పేద యువతుల వివాహాలకు సహకారం అందించేందికి వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పేరుతో పథకాలను తీసుకువస్తున్న విషయం విదితమే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కోసం వైఎస్సార్ కల్యాణమస్తు, ముస్లిం మైనారిటీల కోసం వైఎస్సార్ షాదీ తోఫాను అందిస్తూ వస్తోంది ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఆకుల వెంకట శేషశాయి, జస్టిస్ సుమతి ధర్మాసనం ముందు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్జీటీ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడo సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకం అని పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తెలిపారు.