పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ దొరికింది. రాహుల్ కి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్ పూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పరువు నష్టం కేసులో కోర్టులో రాహుల్ గాంధీ సరెండర్ కావడంతో 45 నిమిషాల కస్టడీ తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ రెండవ సమావేశం అయింది. మ్యానిఫెస్టో కమిటీ కమిటీ ఛైర్మన్ పల్లంరాజు అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతుంది. ఈ మీటింగ్ లో తులసిరెడ్డి, జంగా గౌతం, తాంతియాకుమారి, మస్తాన్ వలి, రమాదేవి, ఉషానాయుడు తదితర నాయకులు ఉన్నారు.
కుటుంబ రాజకీయాలు చేసేవారు.. కేవలం వాళ్లకు లబ్ధి కలిగేలా మాత్రమే చేశారు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపణలు గుప్పించారు. త్వరలో వికసిత్ కశ్మీర్ కల సాకారం అవుతుంది అని చెప్పుకొచ్చారు. జమ్మూ కశ్మీర్ నుంచి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు. మోడీ గ్యారంటీ అంటే ఇలా ఉంటుందన్నారు.
ప్రపంచ సుందరుల పోటీ పెడితే ప్రథమ స్ధానం మోడీదేనంటూ సీపీఐ నారాయణ ఆరోపించారు. అమిత్ షా హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి 12 మందిని చంపి నిర్దోషి అయ్యాడు.. ఇక, ప్రధాని మోడీ ఆర్ధిక ఉగ్రవాది.. అత్యంత క్రిమినల్ గవర్నమెంట్ మన కేంద్రంలో ఉంది అని ఆయన విమర్శించారు.
విజయవాడ నగరంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జై భారత్ పార్టీల రాష్ట్ర స్ధాయి పొలిటికల్ సెమినార్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సమావేశానికి సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వి.వి.లక్ష్మీనారాయణ హాజరయ్యారు.
హెరిటేజ్ మీది కాదు.. మోహన్ బాబుది అని వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి అన్నారు. జైలులో ఉండి కూడా మా ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారని భువనేశ్వరి అంటున్నారు.. ఆరు నెలల్లో మోహన్ బాబు హెరిటేజ్ చంద్రబాబుకు వచ్చేసింది.. నార్కో టెస్ట్ పెడుతా మీకు నేను ప్రశ్నలు అడుగుతా అని ఆయన పేర్కొన్నారు.
గత కొద్దీ రోజులగా దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న నిరసనను కేంద్ర ప్రభుత్వం త్వరగా అర్థం చేసుకోవాలి అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అందరికీ అన్నం పెట్టే రైతును ఆదుకోవాలని కేంద్రాన్ని ఏపీ- తెలంగాణ రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు.
మాజీ ఎమ్మెల్యే పగడాల రామయ్య ఆశయాలను కొనసాగించాలని మార్కాపురం ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ కుందురు నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. పగడాల రామయ్య 6వ వర్ధంతి రాచర్ల మండలం చినగానిపల్లె గ్రామంలోని ఆయన నివాసంలో సోమవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు వైసీపీ ఇంచార్జ్ కుందూరు నాగార్జునరెడ్డి హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.