ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్.. నిరు పేద యువతుల వివాహాలకు సహకారం అందించేందికి వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పేరుతో పథకాలను తీసుకువస్తున్న విషయం విదితమే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కోసం వైఎస్సార్ కల్యాణమస్తు, ముస్లిం మైనారిటీల కోసం వైఎస్సార్ షాదీ తోఫాను అందిస్తూ వస్తోంది ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఆకుల వెంకట శేషశాయి, జస్టిస్ సుమతి ధర్మాసనం ముందు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్జీటీ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడo సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకం అని పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలనాపై రాష్ట్ర స్థాయి మహిళా సదస్సు ఏర్పాటు చేశారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.వి కృషంరాజు ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ లీలా గ్రాండ్ హోటల్ లో ఈ సదస్సు కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి తెలుగు అకాడమీ చైర్ పర్సన్ డాక్టర్ లక్ష్మీపార్వతితో పాటు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల వేళ మరో కీలక నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉంది. వైసీపీ- టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ తమ్మినేని సీతారం నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు పార్టీల రెబల్ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను విచారణకు రావాల్సిందిగా ఇవాళ అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్లు నోటీసులు ఇచ్చారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత బ్రాండ్ షూస్‌ను రిలీజ్ చేశారు. ఆదివారం నాడు ఫిలడెల్ఫియాలో కన్వెన్షన్ సెంటర్లో గోల్డెన్ షూలను ఆవిష్కరించాడు.
థాయ్ ఎయిర్వేస్ విమానంలో బ్రిటన్‌కు చెందిన ప్రయాణికుడు నానా రచ్చ చేశాడు. కోపంలో ఏకంగా విమాన సిబ్బందిలో ఒకరిపై చేయి చేసుకున్నాడు.. ఇక, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
పాకిస్థాన్ లో సంకీర్ణ ప్రభుత్వానికి లైన్ క్లీయర్ అయింది. పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ పవర్ షేరింగ్ ఫార్ములాకు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.