లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు అధికార వైసీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇడుపులపాయ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా నేతలకు జగన్ పెద్ద ఎత్తున అవకాశం కల్పించారు.
లోక్సభ ఎన్నికల ముందు మధ్యప్రదేశ్లో భారతీయ జనతాపార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అజయ్ ప్రతాప్ సింగ్ పార్టీకి రాజీనామా చేస్తున్టన్లు ప్రకటించారు.
జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైంది అని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు.
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సవరించిన చట్టం రాజ్యాంగ ప్రాథమిక స్ఫూర్తికి విరుద్ధమని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే కార్యకలాపాల్లో జేకేఎల్ఎఫ్ (యాసిన్ మాలిక్ వర్గం) నిమగ్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
భారతదేశంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య ప్రత్యక్ష పోటీ ఉన్న సీట్లు చాలానే ఉన్నాయి. గత రెండు లోక్సభ ఎన్నికల్లో ఈ స్థానాలపై బీజేపీ చేతిలో ప్రతిపక్షాలు ఓడిపోయాయి.
లోక్సభ ఎన్నికల ప్రకటనకు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించనుంది. దీనికి ముందు ప్రధాని మోడీ దేశప్రజలకు లేఖ రాశారు.