నెల్లూరు సిటీ పరిధిలోని జండా వీధి.. చిన్న బజార్ ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థి నారాయణ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు పాత నగరంలో వర్షపు నీరు రాకుండా ఉండేందుకు పలు చర్యలను గతంలో చేపట్టామన్నారు.
సిద్ధం మహా సభలను వైసీపీ ఇప్పటికే నిర్వహించింది అని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. నాలుగు సభలలో ప్రజలు జగన్ కి నీరజనం పట్టారు.. జగన్ 99 శాతం హామీలను అమలు చేశారు.. నాయకుడు అంటే ఎలా ఉండాలో చూపించారు..
ఎన్టీఆర్ జిల్లాలో 16.83లక్షల ఓటర్లు ఉన్నారు అని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. జిల్లా ఎన్నికల కంట్రోల్ రూంను ఏర్పాటు చేశాం.. 0866-2570051కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు నేషనల్ క్రికెట్ ఆకాడమీ శుభవార్త చెప్పింది. ఐపీఎల్ 2024 సీజన్ ఆడేందుకు ఆ టీమ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు అధికారికంగా ఎన్సీఏ క్లీన్ చిట్ ఇచ్చింది. ఎన్సీఏ సలహా మేరకు అయ్యర్ ముంబైలోని వెన్నె ముక నిపుణుడిని సంప్రదించగా.. అతను అయ్యర్‌కు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఆర్సీబీ జట్టు బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా తన జట్టు సభ్యులతో చేరాడు. ఆదివారం నాడు అర్థరాత్రి జట్టు సభ్యులతో చేరిన కోహ్లీ ఇవాళ (సోమవారం) బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఇవాళ వైసీపీ రీజినల్ కో- ఆర్డినేటర్ల సమావేశంలో వైఎస్సీఆర్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో 81 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 18 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మార్పులు చేశాము అని తెలిపారు.
షేన్ వాట్సన్ కు ఐపీఎల్, ప్రధాన యూఎస్ఏ లీగ్ లో కామెంటేటర్ గా ముందుగానే ఒప్పందాలను కలిగి ఉండటంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆఫర్ ను అతడు తిరస్కరించినట్లు టాక్. పాకిస్థాన్ జట్టుకు కోచ్ గా వస్తే.. ఏడాదికి రూ. 17 కోట్లు ఇస్తామని పీసీబీ ఆఫర్ చేసినట్లు సమాచారం.
ప్రజాగళం సభపై వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014లో అప్పుడు టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఏర్పాటు చేసుకున్నారు.. ఇప్పుడు మళ్లీ పదేళ్ల తర్వత అదే నాటకం ప్రారంభించారు అని పేర్కొన్నారు.
ఉత్తర కొరియా ఇవాళ పలు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్లను (Ballistic Missiles) పరీక్షించింది. తూర్పు సముద్రంలోకి వాటిని రిలీజ్ చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న టైంలో.. నార్త్ కొరియా ఈ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తుంది.