Islamophobia: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇస్లామోఫోబియాపై పోరాడాలనే తీర్మానంపై చర్చ సందర్భంగా భారత్ తన వాణిని వినిపించింది. కేవలం అబ్రహమిక్ మతాలకు సంబంధించిన వ్యక్తులు, మతపరమైన ప్రదేశాలే లక్ష్యంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బౌద్ధ ఆరామాలు, హిందూ దేవాలయాలు, సిక్కు గురుద్వారాలపై దాడులు జరుగుతున్నాయని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోచ్ ఆరోపించారు. మత ప్రాతిపదికన వివక్ష గురించి మాట్లాడటం ద్వారా కెనడా- పాకిస్తాన్‌ల గురించి భారతదేశం తెలియజేసింది. ఇటీవలి కాలంలో పాకిస్తాన్- కెనడాలో పెద్ద సంఖ్యలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
Read Also: PM Modi : సోలార్ ప్యానెళ్ల పథకం కింద కోటి కుటుంబాలు నమోదు : ప్రధాని మోడీ
ఇక, ఇస్లామోఫోబియాను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక తీర్మానాన్ని తీసుకువచ్చారు. 115 దేశాలు ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశాయి. అయితే 44 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఇస్లామోఫోబియాతో పాటు అన్ని మతాలను ప్రస్తావిస్తూ.. భారతదేశం అన్ని మతాల కోసం నిలుస్తుందని తెలిపింది. అన్ని రకాల మతపరమైన భయాలను వ్యతిరేకిస్తుందని భారతదేశం తరపున రుచిరా కాంబోచ్ పేర్కొంది. ఇస్లామోఫోబియాతో పోరాడటానికి మాత్రమే చర్యలు తీసుకుంటే.. ఇతర మతాలపై దాడులను విస్మరిస్తే.. అది అందరినీ కలుపుకొని సమానంగా పరిగణించబడదన్నారు. ఈరోజు తీసుకొచ్చిన ప్రతిపాదన ప్రకారం అన్ని మతాలపై జరుగుతున్న అకృత్యాలపై దృష్టి సారిస్తారించే అవకాశం ఉందని రుచిరా కాంబోచ్ చెప్పుకొచ్చారు.
PR delivers the explanation of India's position during the adoption of the resolution on 'Measures to combat Islamophobia' at the United Nations General Assembly today. pic.twitter.com/AheU8UvpYM
— India at UN, NY (@IndiaUNNewYork) March 15, 2024