Pakistan’s head Coach: పాకిస్థాన్ జాతీయ జట్టుకు విదేశీ కోచ్ కోసం పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేస్తున్న ప్రయత్నాలకు అడ్డంకులు వస్తున్నాయి. వెస్టిడీస్, యూఎస్ఏలో జరిగే టీ20 ప్రపంచ కప్ తో పాటు వచ్చే ఏడాది ప్రారంభంలో పాకిస్థాన్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోపీతో పాటు దీర్ఘకాల ప్రాతిపదికన జాతీయ టీమ్ కు విదేశీ కోచ్ లను నియమించాలని పీసీబీ ఛైర్మన్ సయ్యద్ మొహ్సిన్ నఖ్వీ భావించారు. దీంతో ఆస్ట్రేలియన్ మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ పేర్లు తెర మీదకు వచ్చాయి. ఇక, డారెన్ సామీ వెస్టడీస్ వైట్ బాల్ జట్టుకు ప్రధాన కోచ్ గా విండీస్ బోర్డుతో ఇప్పటికే ఒప్పందం చేసుకోవడంతో పాటు పీసీబీ విధానాలను అతడు తిరస్కరించినట్లు సమాచారం. ఇక, మరోవైపు షేన్ వాట్సన్ సైతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తుంది.
Read Also: Thalapathy Vijay: ఇదేం అభిమానం రా అయ్యా… హీరో విజయ్ కారు ధ్వంసం చేసిన ఫాన్స్!
ఇక, షేన్ వాట్సన్ కు ఐపీఎల్, ప్రధాన యూఎస్ఏ లీగ్ లో కామెంటేటర్ గా ముందుగానే ఒప్పందాలను కలిగి ఉండటంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆఫర్ ను అతడు తిరస్కరించినట్లు టాక్. పాకిస్థాన్ జట్టుకు కోచ్ గా వస్తే.. ఏడాదికి రూ. 17 కోట్లు ఇస్తామని పీసీబీ ఆఫర్ చేసినట్లు సమాచారం. అలాగే, అనుకున్నట్లు వాట్సన్, డారెన్ సామీ పాక్ హెడ్ కోచ్ గా వచ్చేందుకు నిరాకరించడంతో ఇక, పాకిస్థాన్ మాజీ కెప్టెన్లు యూనిస్ ఖాన్, ముహమ్మద్ యూసుఫ్, ఇంజమామ్ ఉల్ హక్, మొయిన్ ఖాన్ పేర్లు ఉన్నాయి. విదేశీ కోచ్ నియామకం ప్రయత్నం విఫలం కావడంతో పాక్ మాజీ కెప్టెన్లలో ఎవరినో ఒకరిని జట్టు ప్రధాన కోచ్ గా నియమించే అవకాశాలు ఉన్నట్లు పీసీబీ తెలిపింది.