IPL 2024: మరి కొన్ని రోజుల్లో ఐపీఎల్ 2024 సందడి స్టార్ట్ కానుంది. ఈనెల 22వ తేదిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగబోతుంది. ఇప్పటికే సీఎస్కే సారథి మహేంద్ర సింగ్ ధోనీ ప్రాక్టీస్ మొదలు పెట్టాగా.. తాజాగా, ఆర్సీబీ జట్టు బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా తన జట్టు సభ్యులతో చేరాడు. ఆదివారం నాడు అర్థరాత్రి జట్టు సభ్యులతో చేరిన కోహ్లీ ఇవాళ (సోమవారం) బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Read Also: Karnataka: కాంగ్రెస్ గూటికి మాజీ ముఖ్యమంత్రి.. బీజేపీకి కీలక నేత షాక్!
కాగా, విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల గత కొద్ది కాలంగా అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఇటీవల స్వదేశంలో జరిగిన భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కు దూరమయ్యాడు. కోహ్లీ భార్య అనుష్క శర్మ లండన్ లో రెండో బిడ్డకు జన్మనిచ్చింది. అందుకే కోహ్లీ కొద్దికాలంగా క్రికెట్ దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2024లో కోహ్లీ ఆడతాడా? లేదా అనే అనుమానాలు వచ్చాయి. గత రెండు రోజుల క్రితమే కోహ్లీ లండన్ నుంచి భారత్ కు తిరిగి వచ్చాడు.
Read Also: Shane Watson: నేను పాకిస్థాన్ టీమ్కు కోచ్గా రాలేను.. ఎందుకంటే?
ఇక, నిన్న ( ఆదివారం) టీమ్ సభ్యులను కలుసుకున్నాడు. ఇవాళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో విరాట్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు, ఫీల్డింగ్ చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ కింగ్ కోహ్లీ వచ్చేశాడు.. ఈసారి ఆర్సీబీదే కప్ అంటూ వ్యాఖ్యనిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆర్సీబీ టీమ్ ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయింది. తాజాగా డబ్ల్యూపీఎల్ 2024 విజేతగా ఆర్సీబీ ఉమెన్స్ టీమ్ నిలిచింది. ఇప్పుడా స్ఫూర్తితో ఐపీఎల్ లోనూ పురుషుల జట్టు చెలరేగిపోవాలని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు. ఈసారైనా ఆర్సీబీ టీమ్ ఛాంపియన్ గా నిలిస్తుందా.. మళ్లీ ఫ్యాన్స్ కు నిరాశనే మిగుల్చుతుందా అనేది వేచి చూడాలి.
Virat Kohli has started practice session at the Chinnaswamy stadium ahead of the IPL 2024.
– THE GOAT IS GETTING READY TO ROAR…!!!!! 🐐pic.twitter.com/qmkjnUmSHN
— CricketMAN2 (@ImTanujSingh) March 18, 2024