Phone Tapping : ఆరో రోజుకు చేరిన ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ
- ఆరో రోజుకు చేరిన ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ
- ఫోన్ ట్యాపింగ్ సాంకేతిక కోణంలో లోతైన దర్యాప్తు
- ఫోన్లు ఫార్మాట్ చేసిన అంశంపై సిట్ ప్రశ్నలు
- ఎల్లుండి సుప్రీంకోర్టుకు పూర్తి నివేదిక సమర్పణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ఆరో రోజు కూడా కొనసాగుతోంది. ఈ విచారణ రేపటితో ముగియనున్న నేపథ్యంలో, సిట్ (SIT) బృందం విచారణను మరింత వేగవంతం చేసింది. గత ఆరు రోజులుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియలో ప్రధానంగా సాంకేతిక అంశాలతో పాటు, అప్పటి రాజకీయ నాయకుల ఫోన్లను ఏ విధంగా ట్యాపింగ్ చేశారనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి ప్రభుత్వ పెద్దల నుంచి అందిన ఆదేశాల మేరకే ప్రభాకర్ రావు మరియు ఆయన బృందం ఈ ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాలకు పాల్పడినట్లు సిట్ ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది.
విచారణలో భాగంగా ప్రభాకర్ రావు సెల్ ఫోన్లు ఫార్మాట్ చేయడంపై సిట్ బృందం గట్టిగా ప్రశ్నిస్తోంది. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) నుండి అందిన నివేదికల ఆధారంగా అధికారులు విచారణను ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా వాట్సాప్ కాలింగ్, చాటింగ్ డేటా రిపోర్ట్‌లతో పాటు ఐపీ అడ్రస్‌ల ఆధారంగా సాక్ష్యాలను సేకరిస్తున్నారు. మీరు ఎలాంటి తప్పూ చేయనప్పుడు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మరియు క్లౌడ్ స్టోరేజ్‌లోని డేటాను ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందని అధికారులు ప్రభాకర్ రావును నిలదీస్తున్నారు.
Also Read
ఈ కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగు చూసిన అత్యంత కీలకమైన వివరాలు మరియు సేకరించిన సాక్ష్యాధారాలతో కూడిన పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఎల్లుండి సుప్రీం కోర్టుకు సమర్పించనుంది. ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారం మరియు సిట్ సేకరించిన సాంకేతిక ఆధారాలు ఈ కేసులో తదుపరి పరిణామాలకు అత్యంత కీలకం కానున్నాయి. రేపటితో కస్టడీ ముగియనుండటంతో, చివరి రోజు విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!