ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధ్వర్యంలో సోమవారం నాడు సాయంత్రం గన్నవరంలోని రోటరీ క్లబ్ హాల్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గన్నవరం నియోజకవర్గ నలువైపుల నుంచి మూడు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు. అయితే, అక్కడి నుంచే ఆయన పాలన కొనసాగిస్తుండటంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
టెలికాం సేవలందిస్తున్న కంపెనీలు తమ వినియోగదారులపై మరోసారి భారం మోపడానికి రెడీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల తర్వాత టారిఫ్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.
తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పలువురిని కాన్పూర్ జూ పార్క్ కి ఆహ్వానించారు. వారిని జంతువులపై ప్రత్యేకంగా రీల్స్ చేయాలన్నారు.. వీటిలో అత్యధిక వ్యూస్ వచ్చిన వాటికి వేర్వేరు విభాగాలలో బహుమతులను అందజేయనున్నట్లు వెల్లడించారు.
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పార్టీ రానున్న లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను నేడు విడుదల చేయనుంది. ఈ జాబితాలో 15 నుంచి 16 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించే అవకాశం ఉంది.
పాకిస్తాన్లోని రెండవ అతి పెద్ద నౌకాదళ ఎయిర్ స్టేషన్పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడికి దిగింది. పాక్ మీడియాకు అందిన సమాచారం ప్రకారం బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్ ఈ దాడి చేసినట్లు తెలుస్తుంది.