Pakistan: ఉగ్రవాదుల భయంతో ఇళ్లలో దాక్కుంటున్న పాకిస్తానీ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ లో క్లిష్ట పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒక వైపు తాలిబన్లతో యుద్ధ వాతావరణం నెలకొంది. దేశంలో నిరంతరం జరుగుతున్న ఉగ్రదాడుల కారణంగా ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. ఉగ్రవాదుల భయంతో పోలీసు అధికారులు సైతం ఇళ్లలోనే తలదాచుకునే పరిస్థితి ఏర్పాడింది. యూనిఫాం వేసుకోవడానికి కూడా భయపడుతున్నారు. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో దాదాపు 1200 మంది పోలీసు అధికారులు, సైనికులు నిరవధిక సమ్మెకు దిగారు. ఉగ్రవాదుల భయం ఎంత స్థాయికి చేరిందో మనం అర్థం చేసుకోవచ్చు.. పోలీసు అధికారులు గస్తీకి కూడా వెళ్లేందుకు వెనుకాడుతున్నారు.. పోలీసు స్టేషన్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
Read Also: Delhi : స్కూటర్ పై తీసుకెళ్తుండగా రూ.3 కోట్ల నగదును పట్టుకున్న పోలీసులు
Also Read
ఇక, పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని దక్షిణ వజీరిస్తాన్ ప్రాంతంలో సుమారు 1200 మంది పోలీసులు రెండు రోజులుగా సమ్మెలో ఉన్నారు. లోయర్ సౌత్ వజీరిస్తాన్, టోయ్ ఖోలా, స్పెయిన్, తానై, షికాయ్, ఆజం వార్సక్, జగ్జాయ్‌లోని ఆరు పోలీస్ స్టేషన్లు.. వాటికి సంబంధించిన అధికారులు ఈ నిరవధిక సమ్మెలో పాల్గొన్నట్లు తెలిపారు. దక్షిణ వజీరిస్థాన్‌లో సమ్మెలో ఉన్న పోలీసు సిబ్బంది ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నప్పుడు ప్రైవేట్ వాహనాలను ఉపయోగించినందుకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఆరోపణలపై పలువురు పోలీసు అధికారులు, ఉద్యోగులు సస్పెన్షన్‌కు గురయ్యారు. తమ చట్టపరమైన అధికారాలను వినియోగించుకోవడానికి కూడా అనుమతించడం లేదని వారు అంటున్నారు.
Read Also: India-Pakistan Relations: భారత్తో మెరుగైన సంబంధాల కోసం పాకిస్థాన్లో డిమాండ్..
అయితే, రాత్రిపూట తీవ్రవాద దాడుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే రాత్రిపూట కూడా పెట్రోలింగ్ వెళ్లడం లేదు.. ఈ కారణంగానే చాలా మంది అధికారులు తమ వ్యక్తిగత వాహనాలను ప్రభుత్వ విధులు నిర్వహించేందుకు వినియోగిస్తున్నారని అంటున్నారు. వివిధ చెక్‌పోస్టుల వద్ద పారామిలటరీ బలగాలతో సంయుక్తంగా మోహరించడం మరో ప్రధాన సమస్య.. వారు ఈ చెక్‌పోస్టుల దగ్గర పోలీసుల పట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
-
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?