RCB vs PBKS: నేడు ఆర్సీబీతో పంజాబ్ ఢీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌లో ఇవాళ (సోమవారం) బెంగళూరులోని M చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య పోరు జరగబోతుంది. ఇక, ఈ మ్యాచ్ లో విజయం సాధించేందుకు ఇరు జట్లు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే, ఆర్‌సీబీ తన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోగా.. శనివారం నాడు ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక, ఈ దెబ్బకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ మేనేజ్‌మెంట్ జట్టులో కొన్ని మార్పులను చేసే అవకాశం ఉంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్.. దీంతో దానికి అనుకూలమైన జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంటుంది.
Read Also: EPFO : జనవరిలో ఈపీఎఫ్ఓలోకి ఎనిమిది లక్షలమంది కొత్త సభ్యులు
Also Read
ఇక, పంజాబ్ కింగ్స్ టీమ్ తొలి మ్యాచ్ లో విజయం సాధించడంతో మంచి ఊపుమీద కనిపిస్తుంది. ఆర్సీబీని సొంత గడ్డపైనే ఓడించి రెండో గెలుపును తమ ఖాతాలో వేసుకోవాలి అని కెప్టెన్ శిఖర్ ధావన్ చూస్తున్నారు. అయితే, పంజాబ్ టీమ్ ఈ మ్యాచ్ లో ఎలాంటి మార్పులు చేయకుండానే మరోసారి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒకవేళ జట్టులో స్వల్ప మార్పులను చేయాలని అనుకుంటే మాత్రం ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కి బదులు శశాంక్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.. అలాగే మరోక ఇంపాక్ట్ ప్లేయర్‌ని తీసుకునే ఛాన్స్ ఉంటుంది.
Read Also: Gold Price Today : దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే?
తుది అంచనా జట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (WK), కర్ణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్
ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌లు: విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, మనోజ్ భాండాగే, సుయాష్ ప్రభుదేసాయి, యష్ దయాల్.
పంజాబ్ కింగ్స్ జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (WK), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.
ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌లు: రిలీ రోసౌ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, విధ్వత్ కావరప్ప, సికందర్ రజా, క్రిస్ వోక్స్.
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
-
OTR: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?
-
OTR: తుపాకి వదిలి ప్రజాస్వామ్య బాటలో.. దేవ్ జీ పొలిటికల్ ఎంట్రీపై చర్చ
-
Tukkuguda Nurse Case: తుక్కుగూడ నర్సు కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
-
Mamitha Baiju: ప్రముఖ హీరోయిన్ మమిత బైజుకు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!