తెచ్చుకున్న తెలంగాణకు న్యాయం చేయకుండా కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రం బాగుపడింది అని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. అందుకే వారి కుటుంబానికి తగిలే దెబ్బలు ప్రజలందరూ స్వీకరిస్తున్నారు. కవితను అరెస్టు చేయడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు అని తెలిపారు. అలాగే, కాళేశ్వరం, మేడిగడ్డ విషయంలో కూడా బీజేపీ ప్రభుత్వం మాట్లాడకుండా ఉంది అంటే ఆరోజు మెగా వాళ్ళు కోట్ల రూపాయలు ఇస్తున్నారన్నారు. ఇక, వరంగల్ నగరంలో గతంలో మునిగిపోయింది.. త్వరలో బొంది వాగు ప్రాజెక్ట్ ఫండ్ రాబోతుంది ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకుంటామన్నారు. మరి పార్లమెంట్ ఎన్నికల రాబోతున్నాయి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నిరు పేదల ప్రభుత్వంగా ప్రజల్లోకి వెళ్ళింది అని మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు.
Read Also: Kejriwal Wife: కేజ్రీవాల్ శరీరం జైల్లో ఉంటే.. ఆత్మ మాత్రం ప్రజల్లో ఉంది..
కాంగ్రెస్లో చేరిన నాయకులను కార్పొరేటర్లు కొత్త వారిని పాత వారిని రెండు కండ్ల లెక్క చూసుకుంటాను అని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఎవరు భయపడొద్దు.. ఈ క్యాంప్ ఆఫీస్ లో అందరికి అందుబాటులో ఉంటాం.. ఈ రోజు తూర్పు ప్రజల కోసం ఎమ్మెల్యే కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది అని ఆమె తెలిపారు. ఎలక్షన్స్ అప్పుడు ఎంతగానో మా కార్యకర్తలను భయాందోళన గురి చేసిన కూడా వారు భయపడకుండా మమల్ని గెలిపించుకోవడం జరిగింది అని చెప్పుకొచ్చారు. ఇక, దేవాదాయ శాఖలో ఉన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది.. వరంగల్ లో ఉన్న ప్రతి దేవాలయాన్ని తీర్చి దిద్దడమే కాకుండా దేవాదాయ భూములను దేవులపై పాస్ పుస్తకాలను ఏర్పాటు చేస్తే మంచిది అన్నారు.