Dharmana Prasada Rao: ప్రజల ఆరోగ్యం రాజ్యాంగ హక్కు అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ప్రాథమిక బాధ్యతల నుంచి తప్పించుకుంటాం అంటే ఎలా?.. 17 మెడికల్ కాలేజీలు తీసుకు వచ్చాం.. కాలేజీతో పాటు హాస్పిటల్ అందుబాటులో ఉంది.. గవర్నమెంట్ చేయలేనిది ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు చేస్తారు.. ప్రైవేట్ వ్యక్తులు దోచుకోవడానికే చూస్తారని తెలిపారు.
CM Chandrababu: విశాఖకు గూగుల్ను తీసుకొస్తున్నామన సీఎం చంద్రబాబు వెల్లడించారు. సాంకేతికతలో కొత్త ఆవిష్కరణలు రానున్నాయి.. డిజిటల్ కనెక్టివిటీ, డేటా సెంటర్, ఏఐ, రియల్టైమ్ డేటా కలెక్షన్లు కీలకమైనవి.. సాంకేతికను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుంటుంది.
Fake Liquor Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతున్న నకిలీ మద్యం కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ పాత్రపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Gold Safety: భారతదేశంలో రోజు రోజుకు బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలు తమ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాల విషయంలో చాలా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు, రద్దీ ప్రదేశాలలో, మార్కెట్లలో ఎక్కువ బంగారు ఆభరణాలు ధరించకపోవడమే ఉత్తమం అని పోలీసులు సూచిస్తున్నారు.
Tirumala Parakamani Case: తిరుమలలో సంచలనం రేపిన పరకామణి కేసు విచారణ పునఃప్రారంభం అయింది. ఈ కేసు దర్యాప్తును సీఐడీ స్టార్ట్ చేసింది. కేసు వివరాలను సమీక్షించడానికి సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యనార్ తిరుమలకు చేరుకున్నారు.
NTR Vaidya Seva: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5వ రోజు ఎన్టీఆర్ వైద్య సేవల కింద అందించే ఓపీ, ఎమర్జెన్సీ సేవలు నిలిపి వేశారు. రేపటికి సీఈఓ ఆమోదించిన బిల్లులు రూ. 550 కోట్లు చెల్లించాలి అని నెట్ వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులు డిమాండ్ చేశారు.
Sri Sathya Sai District: శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి మండలం కంబాల పర్తి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల కిష్కింధకాండ సృష్టించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.
AP Govt- Google Deal: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ కంపెనీ ఈరోజు ( అక్టోబర్ 14న) ఢిల్లీలో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోనుంది. విశాఖపట్నంలో రూ.88,628 కోట్ల గూగుల్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఎంఓయూ కుదరనుంది.