High Tension in Anakapalle: బల్క్ డ్రగ్ ప్రభావిత గ్రామాల్లో పోలీసుల వలయంలోకి వెళ్ళిపోయాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. రాజయ్య పేటలో క్యాంప్ ఏర్పాటు చేయగా భద్రత చర్యలను అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నారు.
Sugali Preeti’s Mother: కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆందోళనకు దిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఈ సందర్భంగా ప్రీతి తల్లి సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ ఏ ముఖం పెట్టుకొని కర్నూలుకు వస్తున్నారు అని ప్రశ్నించింది.
Minister Lokesh: విశాఖపట్నానికి ఐటీ దిగ్గజం గూగుల్ రాకపై ఏపీ మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చింది.. ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఏపీకి పరిశ్రమలు తరలి వస్తున్నాయి.. కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు.. ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నాయని తెలిపారు.
AP Fake Liquor Case: అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్థన్ అరెస్టు చూసేందుకు అనుమతి ఇవ్వాలని తంబళ్లపల్లెలో ఎక్సైజ్ శాఖ పీటీ వారెంట్ దాఖలు చేసింది.
PM Modi AP Tour: రేపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించారు. ఈ నేపథ్యంలో సిద్ధం చేసిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. నన్నూరు వద్ద 49.37 ఎకరాల్లో 3 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయగా, 18.30 ఎకరాల్లో 3 హెలిప్యాడ్లను సిద్ధం చేశారు.
Insurance Fraud Murder: తిరుపతి జిల్లాలోని నగరి పట్టణంలో విషాదరక ఘటన వెలుగులోకి వచ్చింది. రూ.1.25 కోట్ల నగదు కోసం ఒకరు, తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకుండా ఉండాలని ఆలోచనతో మరొకరు కలిసి గుణశీలన్ అనే వృద్ధుడిని దారుణం హత్య చేశారు.
Deputy CM Pawan: మంగళగిరి క్యాంపు కార్యాలయంలో త్వరలో ప్రారంభం కానున్న పల్లె పండుగ 2.0పై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె పండగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించేలా పల్లె పండగ 2.0 ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు.