CM Chandrababu: ఢిల్లీలో ఐటీ దిగ్గజం గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ‘భారత్ ఏఐ శక్తి’ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార అండ్ ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్.. విశాఖలో అడుగు పెడుతోందని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్‌లో హైటెక్ సిటీని అభివృద్ధి చేశాం.. ప్రస్తుతం విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దబోతున్నట్లు తేల్చి చెప్పారు.
Read Also: Hugs And Kisses: 738 రోజుల తర్వాత కలిసిన జంటలు.. బందీల వీడియోలు వైరల్
ఇక, ప్రస్తుతం విశాఖకు గూగుల్‌ను తీసుకొస్తున్నామన సీఎం చంద్రబాబు వెల్లడించారు. సాంకేతికతలో కొత్త ఆవిష్కరణలు రానున్నాయి.. డిజిటల్ కనెక్టివిటీ, డేటా సెంటర్, ఏఐ, రియల్‌టైమ్ డేటా కలెక్షన్లు కీలకమైనవి.. సాంకేతికను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుంటుంది.. 2047 నాటికి వికసిత్ భారత్ మనందరి లక్ష్యమని తెలిపరు. అయితే, హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ నినాదాన్ని తీసుకొచ్చాం.. రాబోయే ఐదేళ్ల కాలంలో 15 బిలియన్ డాలర్లు ఖర్చు పెడతామని గూగుల్ చెప్పడం సంతోషదాయకం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.