Kota Vinutha: జనసేన బహిష్కృత నాయకురాలు కోట వినుత సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో మనసునిండా పుట్టెడు బాధ ఉంది.. చేయని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ లేకపోయినా, మేము చంపామని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తోంది అని ఆవేదన వ్యక్తం చేసింది.
Chairman's Desk: రాష్ట్రంలో లిక్కర్ స్కాంలు, నకిలీ లిక్కర్, బినామీ పేర్లతో బ్రాందీ షాపులు, పర్మిట్ రూంలు, బెల్ట్ షాపులు.. ఇవి తప్ప వేరే మాటలు వినిపించవా? గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం లిక్కర్ మీదే బతుకుతున్నాయా? ఇటీవల రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం వ్యవహారం చూస్తుంటే.
YCP Protests: నకిలీ మద్యంపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నకిలీ మద్యం, కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాలలో వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Minister Nadendla: విశాఖపట్నంలో పీడీఎస్ రైస్ గుర్తించే రాపిడ్ కిట్స్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం కాకినాడ పోర్టులో జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై అధ్యయనం చేసి చర్యలు చేపట్టాం.. కాకినాడ నుంచి రవాణా అయ్యే ప్రతి సరుకును పరిశీలించి మన దేశానికి చెందిన పీడీఎస్ రైస్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
CM Chandrababu: సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అభినందనలు తెలిపారు. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉంది కాబట్టే గుంటూరు- విజయవాడ మధ్య జిల్లాలో రాజధానిగా ప్రకటించాం.. హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ పెడితే అవహేళన చేశారు.
CM Chandrababu: రాజధాని అమరావతిలోని సీఆర్డీయే కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. భూములు ఇచ్చిన రైతులతో కలిసి ఈ భవనాన్ని ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేని పరిస్థితి ఏర్పడింది.
Cyber Fraud: AI టెక్నాలజీతో సీఎం చంద్రబాబు, దేవినేని ఉమా పేర్లు చెప్పి డబ్బులు వసూల్ చేసిన సైబర్ నిందితుడు భార్గవ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నెల క్రితం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని ఓ టీడీపీ నేత నుంచి 50 వేల రూపాయలను భార్గవ్ వసూలు చేశాడు.
Sri Sathyasai District: శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ ప్రేమ జంట రాత్రిపూట హల్చల్ చేసింది. కదిరి పట్టణంలోని ఓ హోటల్ సమీపంలో రాత్రి 12 గంటల సమయంలో మద్యం సేవించి స్థానికులతో గొడవకు దిగారు.
Nandyal: నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం పుట్టాలమ్మ క్షేత్రంలో కొందరు బాల్య మిత్రులు కలిసి చనిపోయిన స్నేహితుడి కుమార్తె వివాహం జరిపించారు. ఈ సందర్భంగా పెళ్లి పెద్దలుగా మారి పెళ్లి కూతురి పల్లకి సైతం మోశారు.