Dharmana Prasada Rao: ప్రజల ఆరోగ్యం రాజ్యాంగ హక్కు అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ప్రాథమిక బాధ్యతల నుంచి తప్పించుకుంటాం అంటే ఎలా?.. 17 మెడికల్ కాలేజీలు తీసుకు వచ్చాం.. కాలేజీతో పాటు హాస్పిటల్ అందుబాటులో ఉంది.. గవర్నమెంట్ చేయలేనిది ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు చేస్తారు.. ప్రైవేట్ వ్యక్తులు దోచుకోవడానికే చూస్తారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు.. కావాలంటే ప్రభుత్వం సర్వే నిర్వహిస్తే వాస్తవాలు తెలుస్తాయి.. ప్రజల కష్టాల నుంచి దోపిడీ చేయాలనుకుంటున్నారు.. విద్య , ఆరోగ్యం ప్రజలకు చాలా అవసరం.. వైద్యం కోసమే మధ్య తరగతి కుటుంబాలు అప్పుల పాలైతున్నాయి.. కూటమి ప్రభుత్వ విధానాలు ఘోరమైన తప్పిదం.. కరోనాతో చాలా కుటుంబాలు సర్వనాశనం అయ్యాయి.. వైద్య ఖర్చులు భరించలే , అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉండేవి.. అందుకే నాడు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ వంటి పథకాలు తీసుకొచ్చారు.. నేడు ఆరోగ్య శ్రీ అంటే గౌరవం లేకుండా చేశారని ప్రసాద్ రావు ఆరోపించారు.
Read Also: Maganti Sunitha: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత, కూతురిపై కేసు నమోదు
ఇక, కూటమి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ ని డైల్యూట్ చేస్తుందని మాజీ మంత్రి ప్రసాద్ రావు అన్నారు. లక్షల కోట్ల రూపాయలు ఎంబీబీఎస్ సీటు కోసం ఖర్చు చేసిన విద్యార్థులు డాక్టర్ అయ్యాక ప్రజల వద్ద నుంచి డబ్బులు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని తెలిపారు. ఉద్దానం కిడ్నీ వ్యాధితో బాధపడేవారిని రాజకీయంగా అన్ని పార్టీలు వాడుకున్నారు.. వైసీపీ ప్రభుత్వం కోట్ల రూపాయల ఖర్చు చేసి, మంచి నీరు, కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ కట్టించాం.. వైద్యం కోసం టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సామాన్యులు కుటుంబాలకు ఆరోగ్యం పొందే అవకాశం లేదా?.. స్వతంత్రం వచ్చిన 76 ఏళ్ల తరువాత కూడా గిరిజన ప్రాంతాలలో మెడికల్ కాలేజీ అందుబాటులో లేదు.. మెడికల్ కళాశాలలు ప్రైవేట్ చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. పోరాటం చేస్తాం, ప్రభుత్వం తమ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలను దోచేస్తున్నాయి.. చచ్చిపోయిన తరువాత కూడా వైద్యం చేస్తూ దోపిడే చేస్తున్నారని ప్రసాద్ రావు పేర్కొన్నారు.