NTR Vaidya Seva: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5వ రోజు ఎన్టీఆర్ వైద్య సేవల కింద అందించే ఓపీ, ఎమర్జెన్సీ సేవలు నిలిపి వేశారు. రేపటికి సీఈఓ ఆమోదించిన బిల్లులు రూ. 550 కోట్లు చెల్లించాలి అని నెట్ వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులు డిమాండ్ చేశారు. అలాగే, ఈ నెల నుంచి నెలకు రూ. 800 కోట్లు చొప్పున బిల్లుల చెల్లింపుకు ఏర్పాటు చేసి రెగ్యులర్ చేయాలి అని కోరారు. రూ. 2700 కోట్ల వరకూ బకాయిలు ఉండటంతో ఇబ్బందికరంగా మారిందని పేర్కొంటున్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రారంభించే లోపుగా మిగిలిన బిల్లుల చెల్లింపుకు రోడ్ మ్యాప్ ఇవ్వాలి.. ఎన్టీఆర్ వైద్య సేవ ప్యాకేజీల రేట్లు ద్రవ్యోల్బణం ఆధారంగా పెంచాలి.. కేంద్ర ప్రతిపాదిత ఆరోగ్య సేవా స్కీంలతో సమానంగా ప్యాకేజీ రేట్లు ఉండాలని నెట్ వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులు చెప్పుకొచ్చారు.
Read Also: Salman Khan : ఆ ఇద్దరి స్టార్ డైరెక్టర్స్ పై తీవ్ర ఆరోపణలు చేసిన సల్మాన్ ఖాన్
అయితే, ఎన్టీఅర్ వైద్య సేవల పథకం ప్యాకేజీల రేట్లు 30 నుంచి 40 శాతం తక్కువగా ఉన్నాయని నెట్ వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులు తెలిపారు. గ్రీవెన్స్ కమిటీల సమావేశాలు రెగ్యులర్ గా జరపాలి.. సీఈఓలను ఎక్కువగా మార్చేయడం సమాచార లోపానికి, విధానాల అమలు లోపానికి కారణం అవుతోంది అన్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అమలు నిర్ణయాలు తీసుకోవడంలో స్పెషాలిటీ ఆసుపత్రులను భాగం చేయాలని కోరారు. స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ తో చర్చించిన తరువాతే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అమలుపై నిర్ణయం తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.