Sri Sathya Sai District: శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి మండలం కంబాల పర్తి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల కిష్కింధకాండ సృష్టించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. అయితే, హెడ్మాస్టర్ రామాంజనేయులు శిక్షించారన్న కోపంతో ఇద్దరు స్టూడెంట్స్ పాఠశాలకు వెళ్లి దుశ్చర్యకు పాల్పడ్డారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన కోడి గుడ్లను విసిరి కొట్టారు. అంతేకాకుండా, పాఠశాల రికార్డులను చెల్లా చెదురుగా పడేశారు. ఈ సంఘటనతో స్కూల్ సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
Read Also: Vaibhav Suryavamshi: అప్పుడే ప్రమోషన్.. వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ!
అయితే, ఈ ఘటనపై హెడ్మాస్టర్ రామాంజనేయులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ తీసుకున్న విచారణ చేపట్టారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత ధ్వంసమైన వస్తువులకు నష్టపరిహారం చెల్లించేలా స్టూడెంట్స్ తల్లిదండ్రులు అంగీకరించారు. విద్యార్థులకు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు హెచ్చరించారు. అయితే, ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.