Gold Safety: భారతదేశంలో రోజు రోజుకు బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలు తమ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాల విషయంలో చాలా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు, రద్దీ ప్రదేశాలలో, మార్కెట్లలో ఎక్కువ బంగారు ఆభరణాలు ధరించకపోవడమే ఉత్తమం అని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే, ఇంట్లోని బంగారాన్ని సైతం సురక్షితమైన లాకర్లలో భద్రంగా దాచుకోవాలని పేర్కొంటున్నారు. విలువైన వస్తువులు దొంగిలించకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిను చేస్తున్నారు.
Read Also: Trump-Meloni: మెలోని అందమైన అమ్మాయి.. అలాంటే అభ్యంతరం లేదు కదా? నవ్వులు పూయించిన ట్రంప్
మరోవైపు, మరోసారి భారీగా దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. కేవలం ఒక్క రోజులోనే 3 వేల రూపాయలకు పైగా ఈ పసడి ధర పెరిగిపోయింది. ఈరోజు ( అక్టోబర్ 14న) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 3,280 పెరిగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 3000 పెరిగింది. ఇక, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ. 1,28,680 పలుకుతుంది. అలాగే, కిలో వెండి ఈరోజు రూ. 4వేలు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి ధర 2 లక్షల 6 వేలకు చేరింది.