ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తన పేరు రావడంతో మంత్రి అతిషి ఇవాళ స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి అతిషి మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై సంచలన ఆరోపణలు చేశారు. తనకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ద్వారా కమలం పార్టీ తనను సంప్రదించిందని తెలిపింది. బీజేపీలో చేరకుంటే నెల రోజుల్లో అరెస్ట్ చేస్తామని చెప్పారని ఆమె చెప్పుకొచ్చింది. తనతో పాటు సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్, రాఘవ్ చద్దాలను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని అతడి ద్వారి బీజేపీ పేర్కొనింది అని మంత్రి అతిషి వెల్లడించింది. అయితే, ముందుగా ఆప్ అగ్రనేతలను అరెస్టు చేశారు.. ఇక, లోక్ సభ ఎన్నికలకు ముందు మరో నలుగురు ఆప్ నేతలను అరెస్ట్ చేయాలని బీజేపీ భావిస్తోంది అని మంత్రి అతిషి వెల్లడించింది.
Read Also: Bandi Sanjay: ప్రారంభమైన బండి సంజయ్ రైతు దీక్ష.. మద్దతు తెలపాలని పిలుపు..!
అయితే, సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ విచ్ఛిన్నమవుతుందని బీజేపీ ఊహించిందని మంత్రి అతిషి అన్నారు. ఆదివారం నాడు రాంలీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు అని తెలిపింది. ఇక, ఆప్ కి చెందిన నలుగురు నేతలను అరెస్ట్ చేయడం సరిపోదని.. ఇప్పుడు మరో నాలుగురిని అరెస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తుందని ఆమె ఆరోపించారు. మరి కొన్ని రోజుల్లో ఈడీ, సీబీఐ ఆప్ నేతలకు సంబంధించిన పలువురిని అరెస్ట్ చేయాలని బీజేపీ చూస్తుందని మంత్రి అతిషి చెప్పుకొచ్చింది.
Read Also: MLC Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబును అడ్డుకున్న దళితులు.. అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం..
ఇక, సోమవారం నాడు ఈడీ అధికారులు సీఎం కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. విజయ్ నాయర్‌తో ఉన్న సంబంధాల గురించి కేజ్రీవాల్‌ను ప్రశ్నించగా.. నాయర్ తనకు నివేదించలేదు.. అతిషి, సౌరభ్‌లకు నివేదించారని కేజ్రీవాల్ చెప్పినట్లు ఈడీ తెలిపింది. లిక్కర్ కుంభకోణంలో అతిషి, సౌరభ్ భరద్వాజ్ పేర్లను కూడా ఈడీ ప్రస్తావించడం ఇదే తొలిసారి. ఇక, దీనిపై నిన్న ( సోమవారం ) మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ లు స్పందించలేదు.