AP Fake Liquor Case: అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్థన్ అరెస్టు చూసేందుకు అనుమతి ఇవ్వాలని తంబళ్లపల్లెలో ఎక్సైజ్ శాఖ పీటీ వారెంట్ దాఖలు చేసింది. ములకలచెరువు నకిలీ మద్యం కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ తో పాటు పలు రికార్డులను సిట్ అధికారులకు ములకలచెరువు ఎక్సైజ్ అధికారులు అందజేశారు. ఇప్పటి వరకు అరెస్టైన నిందితుల వాంగ్మూలాలు, సీజ్ చేసిన సెల్ ఫోన్లు, ఇతర రికార్డులను విజయవాడకు పంపారు. అయితే, ఇప్పటి వరకు ములకలచెరువు నకిలీ మద్యం కేసులో అరెస్టు చేసినా 10 మందిని కస్టడీ ఇవ్వాలని వేసిన పిటిషన్ పై నేడు కోర్టు విచారణ చేయనుంది.