PM Modi Tour Schedule: రేపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న మోడీ.. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో సున్నీ పెంట వెళ్లనున్నారు. రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. ఉదయం 11.15 లకు శ్రీశైలం ఆలయంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను ఆయన దర్శించుకోనున్నారు. ఇక, మధ్యాహ్నం 12.10 శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు.
Read Also: MH: మావోయిస్ట్ పార్టీకి బిగ్ షాక్.. 61 మంది లొంగుబాటు.. అగ్రనేత మల్లోజుల ఎవరు..?
అయితే, సున్నీపెంటకు చేరుకొని అక్కడ నుంచి హెలికాప్టర్లో నేరుగా నన్నూరు రాగ మయూరి గ్రీన్ హిల్స్ ఎలిప్యాడ్స్ వద్దకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2.30లకు సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. సాయంత్రం 4. 50 నిమిషాలకు కార్యక్రమం ముగించుకుని కర్నూలు ఎయిర్ పోర్టుకు వెళ్లి అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగు పయనం కానున్నారు.