High Tension in Anakapalle: బల్క్ డ్రగ్ ప్రభావిత గ్రామాల్లో పోలీసుల వలయంలోకి వెళ్ళిపోయాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. రాజయ్య పేటలో క్యాంప్ ఏర్పాటు చేయగా భద్రత చర్యలను అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నారు. బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా నెల రోజులకు పైగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో గ్రామానికి వస్తున్న హోం మంత్రి వంగలపూడి అనితని అడ్డుకోవడంతో పాటు జాతీయ రహదారి దిగ్బంధం లాంటి చర్యలతో పోరాటం మరింత ఉధృతంగా మారింది.
Read Also: Maharashtra: ఢిల్లీ బాబా తరహాలో మహారాష్ట్రలో కూడా మరో కీచక పర్వం.. ఇద్దరు అరెస్ట్
అయితే, ఈ అంశంపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. బల్క్ డ్రగ్ పార్క్ ప్రభావిత గ్రామాల్లోని ప్రజలతో నేరుగా చర్చించేందుకు కలెక్టర్ రెడీ అయ్యారు. కానీ, కొన్ని అనివార్య కారణాలతో ఇవాళ రాజయ్య పేటలో జరగాల్సిన మీటింగ్ వాయిదా పడింది. ఈ క్రమంలో మరోసారి ప్రజలు రోడ్డెక్కే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసులు ముందస్తు భద్రతను కట్టుదిట్టం చేశారు. సుమారు వెయ్యి మంది పోలీసులు ప్రభావిత గ్రామాలలో మోహరించారు.