Sugali Preeti’s Mother: కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆందోళనకు దిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఈ సందర్భంగా ప్రీతి తల్లి సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ ఏ ముఖం పెట్టుకొని కర్నూలుకు వస్తున్నారు అని ప్రశ్నించింది. నిందితులకు పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయారు అంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ఒక ఆడ పిల్లకు న్యాయం చేయలేని వారికి డిప్యూటీ సీఎం పదవి ఎందుకు అని ప్రశ్నించింది. ఈ కేసులో సీబీఐకి అప్పగించినట్లు చిన్న కాగితం ముక్క చూపించండి అని అడిగింది. కనీసం నా బిడ్డకు అన్యాయం చేసిన నిందితులకు శిక్ష పడేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అయినా చొరవ చూపాలి అని కోరింది. అలాగే, ఏపీ ప్రభుత్వం నిందితుల పక్షాన ఉంది అని సుగాలి ప్రీతిబాయి తల్లి పార్వతి ఆరోపణలు చేసింది.