Insurance Fraud Murder: తిరుపతి జిల్లాలోని నగరి పట్టణంలో విషాదరక ఘటన వెలుగులోకి వచ్చింది. రూ.1.25 కోట్ల నగదు కోసం ఒకరు, తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకుండా ఉండాలని ఆలోచనతో మరొకరు కలిసి గుణశీలన్ అనే వృద్ధుడిని దారుణం హత్య చేసి డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేసి నగరిలోని ఓ చెరువులో పడేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
Read Also: Ashley Tellis: భారత సంతతికి చెందిన అమెరికా రక్షణ వ్యూహకర్త ఆష్లే టెల్లిస్ అరెస్టు
అయితే, నగరి పట్టణంలోని కొత్తపేటకు చెందిన గుణశీలన్ కు విజయ్ తో పాటు ముగ్గురు సంతానం ఉన్నారు. విజయ్ కు అదే ఊరిలోని గంగాధరం కూతరు కౌలస్యతో పెళ్లి జరిగింది. కుటుంబ సమస్యలతో 6 నెలలకే విజయ్ సూసైడ్ చేసుకున్నాడు. ఆయన పేరు మీద వచ్చిన రూ1.25 కోట్ల ఇన్సూరెన్స్ నగదు కోసం గంగాధరంతో పాటు మరో వ్యక్తి ఈ హత్య చేసినట్లు తమిళనాడు రాష్ట్రానికి చెందిన తిరుత్తణి పోలీసులు తెలిపారు. అలాగే, గుణశీలన్ మృతదేహానికి సంబంధించిన అవశేషాల కోసం చెరువులో గాలింపు చేస్తున్నట్లు తిరుత్తణి పోలీసులు తెలిపారు.