CM Revanth Reddy: కేసీఆర్ 2014 అధికారంలో వచ్చిన తర్వాత లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాను అని చెప్పాడని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ, 5 ఏళ్లలో రుణమాఫీ చేయకుండా ఉన్నారన్నారు. ఇక, 2018లో కూడా కేసీఆర్ మళ్లీ రైతుమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేశాడు.. దీని వల్ల రుణమాఫీ చేయకపోవడంతో రైతులకు రెండింతల భారం పెరిగిందన్నారు. పెద్దమ్మ తల్లి సాక్షిగా చెబుతున్నాను.. ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని పేర్కొన్నారు. మా ప్రభుత్వం 100 రోజుల్లో చేసిన మంచి పనులు ఒక్కటి కూడా బీఆర్ఎస్ పార్టీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అలాగే, లోన్స్ అన్నింటిని కూడా పునరుద్దతిస్తామన్నారు. తర్వాత ప్రతి సంవత్సరం 10 శాతం నుంచి 12 శాతం ఆదయాం పెరుగుతుంది.. కాబట్టి, ఈ ఏడాది పెరగబోయే ఆదాయాన్ని రైతు రుణమాఫీ మీద పెట్టే అవకాశం ఉందన్నారు. ఇక, రాజకీయంగా లాభం పొందేందుకే ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. దుబారా ఖర్చులు తగ్గిస్తాం.. అవినీతికి పాల్పడం అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Annamalai: కాంగ్రెస్ కు రామమందిరాన్ని తాకే హక్కు కూడా లేదు..
ఆర్ ట్యాక్స్ అని ఆరోపణలు చేస్తున్న వారే దీనికి సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ముందు కేటీఆర్ మొదలు పెట్టాడు.. ఆ తర్వాత బీజేపీ వాళ్లు ఎత్తుకున్నారు.. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు అన్ని నిధులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. అయితే, దేశంలో అత్యంత అవినీతి పరులందరూ కూడాబీజేపీ పార్టీలోనే ఉన్నారు.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అవినీతి చేశారని ఆరోపణలు చేసిన వాళ్లే.. బీజేపీలోకి వెళ్తే మాత్రం మొత్తం క్లీన్ అయిపోతున్నారని విమర్శించారు. అలాగే, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గాడిద గుడ్డు ఇవ్వ లేదన్నారు. కిషన్ రెడ్డి చెప్పినట్లు రూ. 10 వేల కోట్లను.. ఏ శాఖకు, ఎన్ని నిధులు, ఏ ప్రాజెక్టులకు ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం శ్వేత పత్నం విడుదల చేయాలి.. నిధుల శ్వేతపత్రంపై అమరవీరుల స్థూపం దగ్గరకు కిషన్ రెడ్డితో చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
Read Also: Thug Life : స్టన్నింగ్ అప్డేట్ ఇచ్చిన థగ్ లైఫ్ టీం.. వీడియో వైరల్..
అలాగే, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు కిషన్ రెడ్డి నిధులు తీసుకొస్తే అభినందిస్తాను అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కేంద్ర ప్రభుత్వం మెట్రోకు నిధులు ఇవ్వలేదన్నారు. ఈ ఎన్నికలు జాతీయ పార్టీల మధ్వే పోటీ ఉంటుంది.. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కుప్పకూలిపోతుందని చెప్పుకొచ్చారు. అలాగే, బీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా బీజేపీని గెలిపించడానికి ప్రయత్నిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 14 స్థానాల్లో విజయమే మా టార్గెట్ అన్నారు. ఇక, 70 ఏళ్లలో ఎన్నడూ జరగని అన్యాయం ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దక్షణి భారతదేశానికి జరిగింది.. బీజేపీలో అన్ని పదవులు ఉత్తరాది వారికే ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.