Leopard In Rashtrapati Bhavan: భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 72 మంత్రులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పలు దేశాల ఆహ్వానితులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అధినేతలు పాల్గొన్నారు. ఇందులో 61 మంది బీజేపీ, 11 మంది ఎన్డీయే కూటమి ఎంపీలు ఉన్నారు. కాగా, ఇవాళ ప్రధానమంత్రి అధ్యక్షతన మొదటి కేబినెట్ సమావేశం ఏర్పాటు కానుంది. ఈ రోజు సాయంత్రం 5గంటలకు ఢిల్లీలో ఈ భేటీ జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
Read Also: NEET : సుప్రీంకోర్టుకు చేరిన నీట్ కేసు.. పరీక్ష రద్దు చేయాలని డిమాండ్
అయితే, కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకార సమయంలో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రపతి భవన్‌లో ఓ విచిత్ర జంతువు సంచరించడం కనిపించింది. మంత్రిగా దుర్గాదాస్ ఉయికే ప్రమాణం చేసిన తర్వాత రిజిస్టర్‌లో సంతకం పెడుతున్న సమయంలో సరిగ్గా ఆయన వెనుక రాష్ట్రపతి భవన్ మెట్ల మీద విచిత్ర జంతువు (చిరుత పులి) తిరుగున్నట్లు అక్కడి వీడియోల్లో రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక, ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్స్ వెరైటీ కామెంట్లు చేస్తున్నారు. చిరుత పులులను కూడా రాష్ట్రపతి భవన్‌లో పెంచుతున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి కొంతమంది అవి చిరుతలు కాదంటుండగా.. ఇంకొందరూ అవి చిరుతలేనంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యనిస్తున్నారు. ఏది ఏమైనా సరే, ఈ వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతుంది.
Is that a wild animal in the background, strolling in the Rashtrapati Bhawan? pic.twitter.com/OPIHm40RhV
— We, the people of India (@India_Policy) June 10, 2024