Modi First File Signed: భారత దేశ ప్రధాన మంత్రిగా వరుసగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ రైతుల సంక్షేమమే లక్ష్యంగా తొలి సంతకం చేశారు. ఇక, పదవీ బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా మోడీ తొలి ఫైల్‌పై సంతకం చేసి.. కోట్లాది మంది రైతులకు అద్భుతమైన కానుక అందించారు. 17వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని రైతుల ఖాతాలకు పంపే ఫైలుపై మోడీ సంతకం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. అందువల్ల తొలి సంతకం రైతుల సంక్షేమానికి సంబంధించినదై ఉండడం సముచితమని భావించామని నరేంద్ర మోడీ తెలిపారు.
Read Also: Road Accident: ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. నలుగురు భక్తులు మృతి
ఇక, పీఎం కిసాన్ నిధి పథకం వల్ల 9.3 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. దాదాపు రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం నిధులను విడుదల చేశారు. అలాగే, ఇవాళ సాయంత్రం 5 గంటలకు లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో కొత్త ప్రభుత్వం తమ తొలి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయబోతుంది. ఇక, మోడీ తన కేబినేట్ లో మొత్తం 72 మంది మంత్రులతో ప్రమాణం చేయించారు. అయితే, ఈ భేటీలోనే మంత్రులకు శాఖల కేటాయింపుపై కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.