భారత ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ వేడుక రేపు (జూన్ 9) రాత్రి 7:15 గంటలకు రాష్ట్రపతి భవన్లో జరగబోతుంది. ప్రధానితో పాటే కొత్త మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ కార్యక్రమానికి సామాన్యుల నుంచి మొదలుకుని విదేశీ అతిథులు హాజరుకాబోతున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు గ్రామీణ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి వ్యక్తిగతంగా తనదే బాధ్యత అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ఇవాళ విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. బెంగళూరు గ్రామీణ నియోజకవర్గం నుంచి తన తమ్ముడు డీకే సురేశ్ ఓటమికి తాను వ్యక్తిగత బాధ్యతగా భావిస్తున్నాను అని చెప్పుకొచ్చారు.
కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వరకూ ఎలాంటి అనుమానం లేదు.. కానీ ఆ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ ఎన్నాళ్లు నడుపుతారు అనేది మాత్రం ఊహించలేమని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ చెప్పుకొచ్చారు.
రేపు (జూన్ 9) న్యూయర్క్ వేదికగా టీమిండియా- పాకిస్తాన్ జట్లు మధ్య కీలక పోరు జరగబోతుంది. ఈ చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ ను వీక్షించేందుకు రెండు దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్కు ముందు ఇరు జట్ల ఫ్యాన్స్ కు వాతావరణ శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది.
టీ20 వరల్డ్ కప్ 2024లో మరో సంచలన విజయం నమోదైంది. శ్రీలంకను బంగ్లాదేశ్ ఓడించేంది. పెద్ద జట్లకు చిన్న టీమ్స్ దడపుట్టిస్తున్నాయి. అమెరికాలోని డల్లాస్ వేదిక జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై బంగ్లా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
దక్షిణ భారత దేశంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తుంది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్లో ఈ స్టేడియం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ హాజరుకానున్నట్లు సమాచారం. ఈ మేరకు భారత్ ఆహ్వానాన్ని ముయిజ్జూ స్వీకరించినట్లు అక్కడి మీడియా తెలిపింది.
టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టుకు ఆఫ్ఘనిస్తాన్ టీమ్ గట్టి షాక్ ఇచ్చింది. గ్రూప్- సీలో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్ లో 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్.. నిర్ణత 20 ఓవర్లలో 159 రన్స్ చేయగా, ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ టీమ్ 15.2 ఓవర్లలో మొత్తం జట్టు 75 పరుగులకే ఆలౌట్ అయింది.