నేడు విజయవాడలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి భేటీ.. శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ప్రతిపాదించనున్న పవన్ కళ్యాణ్.. ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్ కు పంపించనున్న మూడు పార్టీలు..
నేటి నుంచి ఏపీ అసెంబ్లీలో ఓటమికి గల కారణాలపై నియోజకవర్గాల వారిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా.. అభ్యర్థులతో విడివిడిగా జగన్ భేటీ..
నేడు భద్రాద్రి జిల్లా అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష సమావేశం.
నేడు కమిషన్ ముందుకు డ్యామ్ సేఫ్టీ.. ఆపరేషన్స్, క్వాలిటీ కంట్రోల్ అధికారులు.. కాళేశ్వరం అవకతవకలపై కొనసాగుతున్న విచారణ.. ఈ నెల 15 వరకు జస్టిస్ పినాకి విచారణ.. నిన్న విచారణకు ఈఈ తిరుపతిరావు గైర్హాజరు.. రేపు కమిషన్ ముందు హాజరుకావాలని ఎల్ అండ్ టీ సహా నిర్మాణ సంస్థల ప్రతినిధులకు ఆదేశం.
నేటి నుంచి ధర్మారెడ్డికి క్యాజువల్ లీవ్ మంజూరు చేసిన ప్రభుత్వం.. ఈ నెల 17 వరకు సెలవు మంజూరు.. ఏపీ విడిచి వెళ్లకూడదని సీఎస్ ఆదేశాలు..
నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు టీజీ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల.. ఎడ్ సెట్ ఫలితాలు విడుదల చేయనున్న ఉన్నత విద్యామండలి ఛైర్మన్..
నేడు నాగర్ కర్నూలు మున్సిపల్ ఛైర్ పర్సన్ పై అవిశ్వాసం.. మున్సిపల్ ఛైర్ పర్సన్ కల్పనాభాస్కర్ గౌడ్ పై.. ఈ రోజు అవిశ్వాస తీర్మానం ఇవ్వనున్న కాంగ్రెస్.. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు.
నేడు టీ20 వరల్డ్ కప్ లో కెనడా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్.. రాత్రి 8గంటలకు న్యూయార్క్ వేదికగా మ్యాచ్..